Advertisementt

చిరు లిస్ట్ లోకి చరణ్ డైరెక్టర్..!

Wed 07th Dec 2016 12:25 PM
chiranjeevi,khaidi no 150 movie,director v v vinaik,surender reddy,chiranjeevi 151st movie,geetha arts banner,boyapati srinu  చిరు లిస్ట్ లోకి చరణ్ డైరెక్టర్..!
చిరు లిస్ట్ లోకి చరణ్ డైరెక్టర్..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపాడు. గత తొమ్మిదేళ్లుగా రాజకీయాల్లో బిజీ అవుదామని కలలు కన్న చిరంజీవి అక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వక మళ్ళీ సినిమాల్లోకొచ్చేసాడు. తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచే చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్షన్ లో 'ఖైదీ నెంబర్ 150' గా మొదలు పెట్టి దాని షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఆ సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యాలని ఆరాటపడుతున్నాడు. ఇక సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న చిరుని డైరెక్ట్ చెయ్యడానికి చాలామంది డైరెక్టర్స్ పోటీపడుతున్నారు. 

అసలు మెగా ఫ్యామిలీ కూడా చిరు 150  వ చిత్రం కోసం మొదట్లో చాలా మంది డైరెక్టర్స్ పేర్లను పరిశీలించి చివరికి వి.వి.వినాయక్ ని ఎంచుకున్నారు. ఇక 'ఖైదీ నెంబర్ 150' చిత్రం విడుదల కాగానే గ్యాప్ లేకుండా సినిమాలు చెయ్యాలని చిరు డిసైడ్ అయ్యాడని అంటున్నారు.  అందుకే 151 వ చిత్ర దర్శకుడి కోసం అప్పుడే డైరెక్టర్స్ వేట మొదలెట్టారని అంటున్నారు. చాలా మంది డైరెక్టర్స్ తో కథల గురించి డిస్కస్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను చిరంజీవి 151  వ చిత్రానికి డైరెక్టర్ గా పని చేస్తాడని అన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ధృవ చిత్రం  దర్శకుడు చిరు 151  వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే చిరుని డైరెక్ట్ చేసే విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డి ధృవ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించాడు.  చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా గురించి డిస్కర్షన్స్ జరుగుతున్నాయని.... ఈ సినిమా వచ్చే సంవత్సరం మొదలవుతుందని చెబుతున్నాడు. ఇక చిరుని కామెడీ రోల్ లో చూడాలని నా కోరిక అందుకే కిక్ సినిమాలో రవితేజని చూపించినట్టు చిరంజీవిగారిని కామెడీ రోల్ లో చూపిస్తానని... చేస్తే కిక్ లాంటి సినిమానే ఆయనతో చేస్తానని అన్నాడు. అయితే ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని అంటున్నారు. మరి నిజంగా సురేందర్ రెడ్డికి చిరు 151  చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టేనా...!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ