Advertisementt

కాజల్ ని వదలని స్టార్ హీరో..!

Wed 07th Dec 2016 12:00 PM
mega star chiranjeevi,khaidi no 150 movie,kajal aggarwal,directors,muragadas,vamsi paidipally,mahesh babu,koratala shiva  కాజల్ ని వదలని స్టార్ హీరో..!
కాజల్ ని వదలని స్టార్ హీరో..!
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ కెరీర్ కి  ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరూ అనుకున్నారు. అసలు కాజల్ చేతిలో సరైన సినిమాలేక చాలా రోజులు ఖాళీగానే వుంది. అయితే కాజల్ కి ఏదో లక్కు కలిసొచ్చి మెగాస్టార్ చిరంజీవి పక్కన 'ఖైదీ నెంబర్150' చిత్రం లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ చిత్రంలో కాజల్ చిరుకు జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక 'ఖైదీ.....' సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ మళ్ళీ తెలుగులో కాజల్ కి ఒక్క ఆఫర్ కూడా రాలేదు.

అయితే ఇప్పుడు కాజల్ కి మరోసారి అదృష్టం తలుపు తట్టిందని అంటున్నారు. ఆ అదృష్టం సూపర్ స్టార్ మహేష్ రూపంలో వచ్చిందట. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మురుగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల మూవీ కి షిఫ్ట్ అవుతాడు మహేష్. కొరటాలతో తన 24వ ప్రాజెక్ట్ 'భరత్ అను నేను' (టైటిల్ గా అనుకుంటున్నారు) సినిమా పూర్తి అవ్వగానే తన 25 వ చిత్రాన్ని లైన్ లో పెట్టె ఆలోచనలో మహేష్ నిమగ్నమయ్యాడు. ఆ 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్క్షన్ లో చెయ్యడానికి మహేష్ సిద్ధమయ్యాడని వార్తలొస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా కాజల్ ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే కాజల్ మహేష్ పక్కన 'బిజినెస్‌మేన్, బ్రహ్మ్మోత్సవం' చిత్రాల్లో నటించింది. అందులో 'బిజినెస్‌మేన్' హిట్ కాగా, 'బ్రహ్మ్మోత్సవం' డిజాస్టర్. ఇక ఎప్పుడు మూడోసారి కాజల్, మహేష్ తో కలిసి నటించడానికి రెడీ అయ్యిందన్నమాట. పాపం కాజల్ పనైపోయిందని చెప్పుకున్నవారు ఇప్పుడు కాజల్ అవకాశాలు చూసి ఆహా కాజల్ అని అనుకుంటున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ