Advertisementt

మరోసారి మెగా వర్సెస్‌ నందమూరి..!

Tue 06th Dec 2016 09:34 PM
mega ram charan,dhruva movie,jr ntr,pawan kalyan,temper movie,fans,ram charan,ntr,ram charan fans,jr ntr fans,ram charan vs jr ntr  మరోసారి మెగా వర్సెస్‌ నందమూరి..!
మరోసారి మెగా వర్సెస్‌ నందమూరి..!
Advertisement
Ads by CJ

గత 30ఏళ్లుగా టాలీవుడ్‌లో మెగా వర్సెస్‌ నందమూరి పోటీ నడుస్తోంది. ఈమద్య కాలంలో అది కాస్తా పీక్‌కి చేరింది. ఇటీవల పవన్‌, జూనియర్‌ల ఫ్యాన్స్‌ గొడవ చివరకు ఓ హత్యకు కూడా దారితీసింది. ఇలా ఒక హీరో అభిమానులు మరో హీరోకు శత్రువులుగా మారడం గర్హనీయమనే చెప్పవచ్చు. తాజాగా చరణ్‌ 'ధృవ' చిత్రం విషయంలో ఆయన తమ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఫాలో అయ్యాడంటూ ఆయన అభిమానులు చరణ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్‌ అభిమానులు చరణ్‌పై చేస్తున్న కామెంట్స్‌ పీక్‌స్టేజీకి వెళ్లాయి. 'ధృవ' చిత్రంలోని ఓ స్టిల్‌లో చరణ్‌ బీచ్‌ ఒడ్డున కండలు తిరిగిన సిక్స్‌ప్యాక్‌తో, జీన్స్‌ ప్యాంటు వేసుకొని నడుస్తున్న స్టిల్‌ను చూస్తుంటే 'టెంపర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ కనిపించిన ఓ స్టిల్‌కి పూర్తిగా కాపీగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ మేకింగ్‌ వీడియో చూస్తే పవన్‌ నటించిన 'తమ్ముడు' చిత్రంలో 'ఐ యామ్‌ జస్ట్‌ ట్రావెల్‌ లైకే సోల్జర్‌'ని చూసి తీసినట్లుగా కనిపిస్తోందని, ఇలా బాబాయ్‌ని అబ్బాయి, అబ్బాయిలను బాబాయ్‌లు కాపీ కొట్టడం మెగా హీరోలకు కామనే అనే సెటైర్లను కూడా జూనియర్‌ ఫ్యాన్స్‌ చరణ్‌ అభిమానులపై సంధిస్తున్నారు. దీనికి చరణ్‌ అభిమానులు సినిమా విడుదలైన తర్వాత తమ హీరో చిత్రం 'టెంపర్‌'తో పాటు అన్ని చిత్రాల రికార్డులను తిరగరాస్తుందని, అప్పటి దాకా వెయిట్‌ చేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుందంటూ సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ