గ్రేట్ డైరెక్టర్ వంశీకి, కామెడీ స్టార్‌గా రాజేంద్రప్రసాద్‌కి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన చిత్రం 'లేడీస్‌టైలర్'. 30ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రంలో జాతకాల పిచ్చి కలిగిన లేడీస్‌టైలర్ తాను చేసుకోబోయే అమ్మాయికి తొడపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం తిరుగుతుందని ఓ జ్యోతిష్కుడు చెప్పిన విషయాన్ని నమ్మి, ఏ మహిళకు అక్కడ పుట్టుమచ్చ ఉందో తెలుసుకొనే క్రమంలో ఫుల్‌లెంగ్త్‌ఎంటర్‌టైనర్‌గా నడిచి, పెద్ద విజయం సాధించింది. వాస్తవానికి ఈ చిత్రం ఓ అడల్ట్ పాయింట్ చుట్టూ తిరిగినా, ప్రేక్షకులకు మరీ ఎబ్బెట్టు శృంగారంగా కాకుండా, సుతిమెత్తగా, అందరినీ అలరించేలా ఈచిత్రాన్ని దర్శకుడు వంశీ తెరకెక్కించిన విదానం అద్బుతం. కాగా ఇప్పుడు ఆయన ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో లేడీస్ టైలర్‌గా కాకుండా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపించనున్నాడు. 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కాగా 1985లో వచ్చిన 'లేడీస్‌టైలర్'లో పుట్టుమచ్చ కోసం వెతికే వ్యక్తి అందుకు తగ్గట్లుగా ఆడవారికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటాడు. కానీ నేటి ట్రెండ్‌కు అది వర్కౌట్ కాదు. నేటి రోజుల్లో హీరోయిన్లే కాదు... సామాన్య మధ్యతరగతి అమ్మాయిలు కూడా స్కర్ట్‌లు, స్లీవ్‌లెస్‌లు వేసుకుంటున్నారు. మరి ఈ సారి మన లేడీస్ టైలర్ కొడుకైన ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయిలలో దేనికోసం వెతుకుతాడు? పుట్టు మచ్చ స్దానంలో మరి వేరే దానికోసం ఏమైనా వెతుకుతాడా? లేక పుట్టుమచ్చ కోసమే వెతికితే అది తొడలపై కాకుండా ఎక్కడ ఉండేలా వంశీ చూపించనున్నాడు? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. కాగా ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్, మానస, ఈషాలు నటిస్తున్నారు. తాజాగా ఈషాను తొలగించి ఆ స్దానంలో మనాలి రాథోడ్‌ను తీసుకున్నారని సమాచారం. సినిమాలను ఎంతో క్రియేటివ్‌గా తీస్తాడని, హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తాడనే పేరున్న వంశీకి ఈమద్య సరైన హిట్ లేదు. మరి ఈ చిత్రంతోనైనా వంశీ మరలా తన పూర్వపుక్రేజ్‌ను తెచ్చుకుంటాడో లేదో? అలాగే సరైనహిట్ లేని యువ హీరో సుమంత్ అశ్విన్‌కు ఈ చిత్రం ఎలాంటి టన్నింగ్ పాయింట్ అవుతుందో వేచిచూడాల్సివుంది.