Advertisementt

మహేష్ ముఖ్యమంత్రిగా..కన్ఫమ్..!

Tue 06th Dec 2016 02:10 PM
mahesh babu,koratala siva,bharat anu nenu movie  మహేష్ ముఖ్యమంత్రిగా..కన్ఫమ్..!
మహేష్ ముఖ్యమంత్రిగా..కన్ఫమ్..!
Advertisement
Ads by CJ

మహేష్-కొరటాల కాంబినేషన్‌లో శ్రీమంతుడు తర్వాత మరో మూవీ వస్తుంది అని తెలియగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వినిపించినా.. టాలీవుడ్‌ అంతా అప్రమత్తం అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో తొలిసారి మహేష్ ఓ రాజకీయ నాయకుడిగా, అది కూడా ముఖ్యమంత్రిగా నటిస్తాడని వార్తలు రావడమే. ఈ సినిమాకి టైటిల్‌ ఏం పెడతారా అనేది మాత్రం ఇప్పటికే బయటికి వచ్చినప్పటికీ.., శ్రీమంతుడు లాంటి మరో టైటిల్ పెడతారని అంత ఆశగా ఎదురు చూసారు. అయితే మొదటి నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమాకి ‘భరత్ అను నేను’ టైటిల్ నే సెలక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. 

‘భరత్ అను నేను’ అనే టైటిల్ కథాపరంగా సినిమాకి కరెక్ట్ గా సూట్ అవుతుందని.. ఇదే టైటిల్‌ని ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మిస్తున్న డివివి దానయ్య ఈ టైటిల్‌ని ఫిల్మ్ చాంబర్‌లో రిజిష్టర్ చేయించడంతో మహేష్ సినిమాకి టైటిల్ పక్కాగా ఇదే అని న్యూస్ బయటికి వచ్చేసింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ