Advertisementt

అల్లు అరవింద్ కి.. సిస్టర్ వియోగం..!

Tue 06th Dec 2016 12:17 PM
allu aravind,allu aravind sister bharathi,allu bharathi death,allu ramalingaiah daughter bharathi death  అల్లు అరవింద్ కి.. సిస్టర్ వియోగం..!
అల్లు అరవింద్ కి.. సిస్టర్ వియోగం..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నటించిన  ధృవ సినిమా విడుదలకు సిద్దమై పబ్లిసిటీ కార్యక్రమాల్లో తలమునకలుగా వున్న సమయంలో వారి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ విషాదమేమంటే కమెడియన్ మరియు చిరంజీవికి పిల్లనిచ్చిన మామగారు అయిన అల్లు రామలింగయ్య పెద్ద కూతురు భారతి మృతిచెందినట్లు భారతి అన్న, అల్లు రామలింగయ్య  కొడుకు అల్లు అరవింద్ ప్రకటించారు. అల్లు అరవింద్ కి, చిరంజీవి భార్య సురేఖకి.. భారతి పెద్ద అక్కయ్య. భారతికి పెళ్లి కాలేదు. అల్లు భారతి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఈ రోజు (సోమవారం) తుదిశ్వాస విడిచారని సమాచారం. అనుకోకుండా ఆమె తనువు చాలించడంతో అల్లు ఫ్యామిలీ అంతా సోకసముద్రంలో మునిగిపోయింది. 

ఇక రామ్ చరణ్, అల్లు అరవింద్ లు ధృవ  పబ్లిసిటీ కార్యక్రమాలకు బ్రేక్ వేసి అల్లు భారతి అంతిమ యాత్రకు ఏర్పాట్లు జరుపుతున్నారని సమాచారం. కోకాపేటలోని ఫామ్ హౌస్ లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.