Advertisementt

గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నా దర్శకుడు..!

Mon 05th Dec 2016 06:50 PM
director anil ravipudi,patas movie,kalyan ram,anil new movie,mega hero varun tej,kalyan ram,waiting for dates  గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నా దర్శకుడు..!
గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నా దర్శకుడు..!
Advertisement
Ads by CJ

ఒక దర్శకుడు ఒక్క పెద్ద హిట్‌ ఇస్తేనే ఇక అతని వెంట హీరోలు, నిర్మాతలు క్యూకడుతారనే అభిప్రాయం ఉంది. కానీ తన తొలిచిత్రం 'పటాస్‌' ద్వారా నందమూరి కళ్యాణ్‌రామ్‌కు పదేళ్ల కెరీర్‌లో అతిపెద్ద హిట్‌ను అందించిన కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆ తర్వాత మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో 'సుప్రీం' వంటి ఫక్తు కమర్షియల్‌ చిత్రాన్ని తీసి, కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆయన హీరో రామ్‌కు ఓ స్టోరీ చెప్పాడు. ఈ చిత్రం ముందు ఓకే అవుతుందని అందరూ భావించినప్పటికీ రామ్‌ మాత్రం ఈ చిత్రం నుండి పక్కకు వచ్చేశాడు. అదే సమయంలో ఆయన కళ్యాణ్‌రామ్‌ దయతో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు కూడా కథ చెప్పించి ఒప్పించాడని వార్తలు వచ్చాయి. కానీ అవి పట్టాలెక్కలేదు. ఎన్టీఆర్‌తో చిత్రం మాత్రం ఓకే అయ్యే ఛాన్స్‌లున్నాయంటూ పలు వార్తలు షికారు చేశాయి. కానీ ఎన్టీఆర్‌ కూడా ఈ దర్శకుడిని పక్కన పెట్టి బాబీ దర్శకత్వంలో ఓ చిత్రానికి ఓకే చెప్పినట్లు తాజా సమాచారం. దీంతో తన హ్యాట్రిక్‌ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనిల్‌ రావిపూడి ప్రస్తుతం నిరుత్సాహానికి లోనయ్యాడు. తాజాగా ఆయన మరో అప్‌కమింగ్‌ మెగాహీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా, నందమూరి కళ్యాణ్‌రామ్‌తోనే రెండో చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి సరిపడే కథలను తయారు చేసే పనిలో ఈ దర్శకుడు నిమగ్నమై ఉన్నాడంటున్నారు. మరి వారి డేట్స్‌ ఆయనకు లభిస్తాయా? లేదా? అనే విషయంపై మాత్రం ఎవ్వరు పెదవి విప్పడం లేదు. అనిల్‌ కూడా ఆయా హీరోలు పక్కాగా డేట్స్‌ ఇచ్చిన తర్వాత మాత్రమే దీనిని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ