Advertisementt

రోబో 2.0 కి గాయం..!

Mon 05th Dec 2016 03:27 PM
super star rajinikanth,kamal haasan,robo 2.0 movie,rajinikanth leg injured,kelambakkam east coast road  రోబో 2.0 కి గాయం..!
రోబో 2.0 కి గాయం..!
Advertisement
Ads by CJ

స్నేహితులిద్దరికి ఈ మధ్యన ఏమైందో ఏమోగానీ వరసబెట్టి హాస్పిటల్స్ కి వెళుతున్నారు. ఆ స్నేహితులు మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లు. రజినీకాంత్ అనారోగ్యంతో చాలా కాలం అమెరికాలో ట్రీట్మెంట్  తీసుకుని ఈ మధ్యనే చెన్నై చేరుకున్నాడు. ఇక కమల్ హాసన్ శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో మెట్ల మీద నుండి జారిపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఇక వీరిద్దరూ ఇప్పుడిప్పుడే కోలుకుని తమ తమ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. 

అయితే ఇప్పుడు రజినీకి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఎలా అంటే రజినీకాంత్ రోబో 2. 0  మూవీ షూటింగ్ లో పాల్గొనగా అక్కడ ఆయన కాలికి గాయమైందని చెబుతున్నారు. చెన్నైలోని కేలంబాక్కం ఈస్ట్ కోస్ట్ రోడ్డు వద్ద 2 .0  మూవీ షూటింగ్ లో ఆయన కాలుజారి పడినట్లు వార్తలొస్తున్నాయి. బాగా వర్షం పడి తడిగా ఉండడంతో రజినీ చూసుకోకుండా నడవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇక వెంటనే రజినీని హాస్పిటల్ కి తరలించగా డాక్టర్స్ ఆయన కాలికి గాయాలు అయిన చోట కుట్లు వేసి ఇంటికి పంపేశారట. అయితే రజినీకాంత్ కొన్నిరోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట.అంతకుమించి ప్రమాదం లేదని చెప్పారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ