Advertisementt

నాని దారిలో నడుస్తున్న పవన్‌..!

Mon 05th Dec 2016 01:48 PM
power star pawan kalyan,keerthi suresh,emmanuelle,director trivikram  నాని దారిలో నడుస్తున్న పవన్‌..!
నాని దారిలో నడుస్తున్న పవన్‌..!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ పెద్ద స్టార్‌ హీరో కావడంతో ఆయనతో చిత్రాలను చేయాలని టాప్‌హీరోయిన్లు కూడా ఎదురుచూస్తుంటారు. కానీ పవన్‌ రూటే సపరేట్‌ కదా...! అందుకే ఆయన స్టార్‌హీరోయిన్ల కంటే చిన్న హీరోయిన్లకే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా ఆయన నానితో రొమాన్స్‌ చేస్తున్న ఇద్దరు హీరోయిన్లకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తాను చేయబోయే హ్యాట్రిక్‌ మూవీలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కుట్టిల వైపు ఎక్కువగా చూసే త్రివిక్రమ్‌ సైతం ఈ విషయంలో పవన్‌ చెప్పిన వారినే తీసుకున్నాడు.'నేను..శైలజా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ప్రస్తుతం నాని నటిస్తున్న 'నేను.. లోకల్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తిసురేష్‌ను మొదటి హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్‌ని సైతం నానితో రొమాన్స్‌ చేసి మెప్పించిన భామనే ఎంపిక చేసుకున్నారు. నానితో ఇటీవల వచ్చిన 'మజ్ను' చిత్రంలో ఆయన సరసన మంచి నటన కనపర్చిన మరో మలయాళ భామ అను ఎమ్మాన్యుయేల్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్‌ ఎక్కువగా కష్టపడకుండా నాని హీరోయిన్ల వైపు చూస్తూ ఉన్నాడంటూ కొందరు పవన్‌, త్రివిక్రమ్‌లపై సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ