Advertisementt

డిసెంబర్‌ 23న పరిస్థితి ఏంటి..?

Sun 04th Dec 2016 04:22 PM
s3 movie,surya,director hari,dil raj,hebah patel,manchu laxmi,nenu local movie,meelo evaru koteeswarudu movie,december 23,yudham movie,nanna nenu na boyfriends movie,lakshmi bomb movie  డిసెంబర్‌ 23న  పరిస్థితి ఏంటి..?
డిసెంబర్‌ 23న పరిస్థితి ఏంటి..?
Advertisement
Ads by CJ

సూర్య, హరి కాంబినేషన్‌లో మంచి క్రేజ్‌తో రూపొందుతున్న 'ఎస్‌3' చిత్రాన్ని డిసెంబర్‌ 16న కాకుండా 23న రిలీజ్‌ చేయాలని నిర్ణయించడంతో పలు చిన్న, మీడియం బడ్జెట్‌ చిత్రాల రిలీజ్‌లు ఇప్పుడు సందిగ్దంలో పడ్డాయి. వాస్తవానికి ఈనెల 23న మూడు చిత్రాలు విడుదలవుతాయని భావించారు. దిల్‌రాజు నిర్మాణంలో నేచురల్‌స్టార్‌ నాని, సెన్సేషనల్‌ హీరోయిన్‌ కీర్తీసురేష్‌లు జంటగా, 'సినిమా చూపిస్త మావా' దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'నేను.. లోకల్‌' సినిమా విడుదల కావాల్సివుంది.కానీ ఈ చిత్రం విడుదల ప్రస్తుతం సందిగ్దంలో పడింది. ఈ చిత్రం ఆర్టిస్టుల డేట్స్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల షూటింగ్‌ ఆలస్యమవుతోందని, దీంతో ఈ చిత్రం అనుకున్న తేదీకి వచ్చే అవకాశాలు లేవని, జనవరి నెలాఖరులో గానీ ఈ చిత్రం విడుదల కాదంటున్నారు. ఇక 23న రావాల్సిన చిన్న చిత్రాలైన నవీన్‌చంద్ర, 30ఇయర్స్‌ఇండస్ట్రీ పృథ్వీలు కీలకపాత్రల్లో నటిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను ఓ వారం ముందుగా 16వ తేదీన విడుదల చేస్తున్నారు. లక్కీహీరోయిన్‌ హెబ్బాపటేట్‌, రావు రమేష్‌లు తండ్రీ కూతుర్లుగా నటిస్తూ, దిల్‌రాజు విడుదల చేయనున్న చిత్రం 'నాన్న...నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్‌' చిత్రం కూడా డిసెంబర్‌16న విడుదల కానుండగా, మంచు లక్ష్మి నటించిన 'లక్ష్మీబాంబ్‌ ఫ్రమ్‌ శివకాశి' చిత్రం కూడా 23 నుండి విడుదల తేదీని వాయిదా వేస్తున్నారని సమాచారం. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ 'యుద్దం' చిత్రం మాత్రమే డిసెంబర్‌ 23న రానుంది. మొత్తానికి ఇటు 'ధృవ', అటు 'ఎస్‌3' వల్ల లోబడ్జెట్‌, మీడియం బడ్జెట్‌ చిత్రాల నిర్మాతలు పలు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ