Advertisementt

గడ్డంతో ఆశ్చర్యానికి గురి చేసిన హీరో..!

Sun 04th Dec 2016 01:19 PM
hero ram,director karunakaran,after sankranthi opening new movie,raashi khanna birthday function in hero ram  గడ్డంతో ఆశ్చర్యానికి గురి చేసిన హీరో..!
గడ్డంతో ఆశ్చర్యానికి గురి చేసిన హీరో..!
Advertisement
Ads by CJ

ఈమద్యకాలంలో వరుస పరాజయాలతో సతమతమైన హీరో రామ్‌ 'నేను..శైలజా'తో మరలా ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఆయనకు ఆ సంతోషం ఎక్కువకాలం నిలబడలేదు. తర్వాత వచ్చిన 'హైపర్‌' చిత్రం ఫ్లాప్‌ కావడంతో ఆయన మరోసారి కథల ఎంపికలో నిదానమే ప్రధానం అంటున్నాడు. పలువురి కథలు వింటూనే కాస్త గ్యాప్‌ తీసుకొని కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని సంక్రాంతి ముగిసిన తర్వాత ప్రారంభించనున్నాడని సమాచారం. హీరో రామ్‌ 'దేవదాసు' చిత్రంలో గెడ్డంతో పరిచయమై, ఆ తర్వాత ఒకటి అరా చిత్రాలలో తప్ప మిగిలిన అన్ని చిత్రాల్లో ఒకే గెటప్‌తో కనిపించాడు. కాగా 'హైపర్‌' తర్వాత వచ్చిన గ్యాప్‌లో పలు విభిన్నమైన గెటప్స్‌ ట్రై చేస్తున్నాడు. తాజాగా ఆయన హీరోయిన్‌ రాఖిఖన్నా బర్త్‌డే ఫంక్షన్‌లో డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్‌లో, కోరమీసాలతో, విచిత్రమైన గడ్డంతో ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఈ గెటప్‌ కామన్‌గా ఫ్యాషన్‌ కోసం చేశాడో లేక తన తదుపరి చిత్రం కోసం ఈ విభిన్న గెటప్‌ను ట్రై చేస్తున్నాడో అన్నది మాత్రం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. ఇప్పుడు చాలామంది పరిశ్రమ వ్యక్తులు రామ్‌ కొత్త గెటప్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ