జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోవు సాధారణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా తెదేపాతో పొత్తు పెట్టుకొని భాజపాకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం ఇక ముందు జరగదని తెలుస్తుంది. పవన్ సిద్ధాంతాలతో భావసారూప్యం కలిగిన పార్టీలకు జనసేన పార్టీ మద్దతిచ్చే దిశగా జనసేనాని అడుగులు పడుతున్నట్లుగా అర్థమౌతుంది.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని గళమెత్తుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ తెదేపాతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సహజంగా మొదటి నుండి భాజపానూ, ఆ పార్టీ నాయకులనూ పెద్దఎత్తున ఏకుతుండటంతో భాజపాతో కూడా పవన్ బంధాన్ని తెంచుకున్నట్లుగానే అర్థమౌతుంది. అయితే ఇక పవన్ జనసేన పార్టీతో భావసారూప్యం కలిగిన పార్టీలతో దోస్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాడు. సహజంగా పవన్ కళ్యాణ్ కి లెఫ్టిస్ట్ ఐడియాలజీ అంటే ఇష్టం. ఇటువంటి భావజాలంతో ముందుకు పోతున్న పార్టీలను ఈ మధ్య పవన్ మెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే జనసే, సీపీఐ పార్టీల మధ్య పొత్తు పెరుగుతుందనే భావాన్ని కలిగించే పరిణామం తాజాగా చోటుచేసుకుంది. సీపీఐ నేతలతో పవన్ కల్యాణ్ కలిశాడు. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమెల్సీ చంద్రశేఖర్‌తో ఆయన ముచ్చటించాడు. ఆ అంశం రాష్ట్రమంతా సంచనలం రేపింది. అయితే ఈ భేటీలో పరస్పరం రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు పెద్ద నోట్ల రద్దు అంశం కూడా చర్చించుకున్నట్లు సమాచారం అందుతుంది. అంతే కాకుండా ప్రత్యేక హోదాపై ఎలా ఉద్యమించాలన్న విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే సందర్భంలో నారాయణ మాత్రం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. సీపీఐ నాయకులు మాత్రం పవన్ కల్యాణ్ తో దోస్తీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా సాధించేందుకు పవన్ ను గతంలో ఆ పార్టీ నేతలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు బంద్‌కి పిలుపునిచ్చినప్పుడు కూడా వామపక్షాలు పవన్ మద్దతును కోరాయి. అప్పుడు పవన్ మాత్రం అప్పుడు ఎలాంటి స్పందన తెలపలేదు. అది అలా ఉంచితే పవన్ కల్యాణ్ ఈ మధ్య వాపక్షాలను మెచ్చుకుంటూ వారికి దగ్గరయ్యేందుకు తెగ సంకేతాలు ఇస్తున్నాడు. అయితే పవన్ రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీరి దోస్తీ కోసం పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.