బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న చిత్రం పద్మావతి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటిస్తున్నాడు. రణవీర్ సింగ్, దీపికా పడుకొనే ఇద్దరూ ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన రణవీర్ సింగ్, దీపికా పదుకొనే చాలా కాలం నుంచి లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యనే వారి లవ్ బ్రేక్ అప్ అయిందని వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. కానీ వీరిద్దరి లవ్ బ్రేకప్ కావడానికి ఓ డైరెక్టర్ కారణమంట. వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్ లో స్ట్రిక్ట్ డైరెక్టర్ గా పేరున్న వ్యక్తి సంజయ్ లీలా బన్సాలి. ఈయనే వారిద్దరూ దూరంగా ఉండటానికి కారణం అన్నట్లు వార్త ఒకటి బయటికి వచ్చింది.
అదేంటంటే... పద్మావతి చిత్రం పూర్తయ్యేవరకు రణవీర్ సింగ్, దీపికా పడుకొనే కలిసి బయట కనపడకూడదని దర్శకుడు బన్సాలి వారికి సూచించినట్లు తెలుస్తుంది. ఇద్దరూ కలసి పబ్లిక్ గా తిరగడానికి వీల్లేదని, అంతేకాకుండా బాలీవుడ్ ఫంక్షన్ లకు కూడా సాధ్యమైనంత వరకు హాజరు కావద్దని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా రణవీర్ సింగ్ పద్మావతి చిత్రంలో తనపాత్ర కోసం భారతదేశ చరిత్ర పుస్తకాలు అన్నీ తెగ తిరగేస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికి రణవీర్ సింగ్, దీపికా పడుకొనే దూరం దూరంగా ఉండటానికి కారణం ఆ దర్శకుడేనన్నమాట.