ప్రముఖ సినీ నటి శ్రీదేవి కి, కూతురు వ్యవహారంతో తల బొప్పికడుతుంది. శ్రీదేవి కూతురు జాహ్నవి గతంలో కూడా ఓ పార్టీలో ప్రముఖ రాజకీయ నాయకుడి అబ్బాయి అంటే సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తో కులుకుతూ డైరెక్టుగా ముద్దులాడుతూ దొరికిపోయింది. దాంతో ఖంగుతిన్న శ్రీదేవి, కూతురుకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే అంతటితో ఆమె ఆగడాలు ఆగలేదు. శ్రీదేవి కూతురు జాహ్నవిని సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం చేద్దామని విదేశాల్లో నటనకు సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడానికి పంపింది. అయితే అక్కడ ఆమె ఏకంగా కొత్త ప్రేమాయణాలు మొదలెట్టి జోరుగా చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
తాజాగా శ్రీదేవి కూతురు జాహ్నవి... అక్షత్ రాజన్ అనే యువకుడితో తిరుగుతుందంటూ వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి? ఏకంగా అతడితో సన్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయిపోయాయి. అక్షత్ తన సోషల్ ఎకౌంట్ ద్వారా జాహ్నవితో సన్నిహితంగా, ఘాటు ముద్దులు రేపే ఫోటోలను పోస్ట్ చేసి సంచలనం రేపాడు? ప్రస్తుతం ఆమెతో అతడు ఘాటు ముద్దులెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి? దీంతో మళ్ళీ శ్రీదేవి ఒక్కసారిగా ఖంగుతినడం ఆమె వంతైంది. ఈ సారి ఏ రకంగా కూతురుకు వార్నింగ్ ఇస్తుందో చూడాలి మరి.