తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన, అరుణోదయ సాంస్కృతి సంస్థ అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. అక్కడ అంసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని విమలక్క కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, అక్కడున్న వారిని బలవంతంగా బయటకు పంపిచేశారు. ఆ సమయంలో విమలక్క కూడా అక్కడే ఉన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుచేసి దానికి విమలక్క అధ్యక్షురాలిగా, భీంభరత్ కార్యదర్శిగా ఉన్నారు. అంతకు ముందే భీంభరత్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీంభరత్ పై నిజామాబాద్ లో పలు కేసులున్నట్టు డిటోనేటర్లు సైతం లభించాయని పోలీసులు చెబుతున్నారు.