Advertisementt

నయన్ కండిషన్స్ కి నిర్మాతల కౌంటర్..!

Sat 03rd Dec 2016 09:05 PM
nayanthara,conditions,producers,counter,black money,white money,nayanthara movies  నయన్ కండిషన్స్ కి నిర్మాతల కౌంటర్..!
నయన్ కండిషన్స్ కి నిర్మాతల కౌంటర్..!
Advertisement
Ads by CJ

నయనతార తమిళంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె అక్కడ దాదాపు మూడు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ టాప్ పొజిషన్ లో మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. వయసు మీద పడుతున్నప్పటికీ గ్లామర్ పరంగా నయన్ కుర్ర హీరోయిన్స్ కి దడ పుట్టిస్తుంది. ఇక నయనతార తమిళంలోనే కాదు తెలుగులో కూడా పెద్ద హీరోయిన్. తెలుగులో అడపాదడపా సినిమాలు ఒప్పుకుంటున్నా... తమిళంలో మాత్రం తీరిక లేకుండా గడుపుతుంది. ఇక కెరీర్ పరంగా బిజీగా వున్నట్టే ప్రేమలో కూడా నయన్ ఎప్పుడూ బిజీనే.

ఒకసారి తమిళ్ హీరో శింబుతో ఘాటు ప్రేమలో మునిగి తేలిన నయన్.. శింబుతో ప్రేమకి బ్రేకప్ చేసుకుని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి... పెళ్లివరకు వెళ్ళింది. అయితే ఏమైందో ఏమో ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ చేసిన నయన్ ఇప్పుడు తమిళ దర్శకుడు విఘ్నేష్ తో మళ్ళీ ప్రేమలో పడి ఇప్పుడు ఏకంగా విఘ్నేష్ తో సహజీవనం మొదలు పెట్టిందని అంటున్నారు. రీల్ లైఫ్ లోఒడిదుడుకులున్నట్టే రియల్ లైఫ్ లోను ఎత్తుపల్లాలు చవి చూసిన నయనతారకు కొత్తగా ఒక సమస్య వచ్చిందట. ఇప్పటి వరకు కోలీవుడ్ లో 3  కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని టాప్ లో వున్న నయన్... అంత మొత్తం లో ఎక్కువగా బ్లాక్ మనీ రూపంలోనే తీసుకునేది. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు దెబ్బకి ఆ బ్లాక్ మనీ ని ప్రస్తుతం తను చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి ఇచ్చేసి తన రెమ్యునరేషన్ అంతా వైట్ లోకి మార్చి ఇమ్మని కండిషన్స్ పెడుతుందట. మరి అంత పెద్ద మొత్తాన్ని వైట్ లోకి మార్చి ఇవ్వాలంటే ప్రొడ్యూసర్స్ కి సాధ్యమయ్యే పని కాదు. అందుకే నయనతారని తన సినిమాల నుండి తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకుని నయన్ డిమాండ్స్ కి చెక్ పెట్టాలని చూస్తున్నారట.

అంతటితో ఆగకుండా నయనతార మీద ఏసిబి రైడ్స్ జరిపించి ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రొడ్యూసర్స్ దెబ్బకి నయన్ దిగివచ్చి రెమ్యునరేషన్ తగ్గిస్తుందా.... నిర్మాతలు ఇచ్చింది తీసుకుని కామ్ గా వెళుతుందా అని కోలీవుడ్ మీడియాలో ఒకటే చర్చ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ