Advertisementt

'ఎస్‌3' కి హైలైట్‌ సీన్స్‌ ఇవేనంట..!

Sat 03rd Dec 2016 07:48 PM
  'ఎస్‌3' కి హైలైట్‌ సీన్స్‌ ఇవేనంట..!
'ఎస్‌3' కి హైలైట్‌ సీన్స్‌ ఇవేనంట..!
Advertisement
Ads by CJ

దర్శకుడు హరి డైరెక్షన్‌లో స్టార్‌హీరో సూర్య పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న'సింగం' సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎస్‌3'. 'సింగం (యముడు), సింగం2' లు తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 'ఎస్‌3'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళంలో సూర్యతో పాటు స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నాడు. వీరు ఈ చిత్రాన్ని విజువల్‌ ఫీస్ట్‌లా ఉండేందుకు డబ్బును నీళ్లలా ఖర్చుచేస్తున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఈ చిత్ర నిర్మాతలు వారం రోజులపాటు ఏడు విమానాలను బాడుగకు తీసుకున్నారనే విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. చాలా సన్నివేశాలను విమానంలో వెళ్తూనే చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ విమానాల నేపథ్యంలో కొన్ని అద్భుతమైన సీన్స్‌ను తెరకెక్కించారంటున్నారు. అదే సమయంలో ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే ఛేజింగ్‌ సన్నివేశాలు ఆడియన్స్‌ను థ్రిల్‌గా ఫీలయ్యేలా చేస్తాయని, వీటన్నింటిని వెండితెరపై చూస్తేనే తాము పడిన కష్టం తెలుస్తుందని ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మరి ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తాయో? నిర్మాతలు పెడుతున్న ఖర్చుకు ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే ఈనెల 23 వరకు  వెయిట్‌ చేయకతప్పదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ