Advertisementt

అనవసరపు హంగామా చేస్తున్నారా..!?

Sat 03rd Dec 2016 02:31 PM
queen remake,tyagarajan,queen remake hungama  అనవసరపు హంగామా చేస్తున్నారా..!?
అనవసరపు హంగామా చేస్తున్నారా..!?
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో కంగనారౌనత్‌ ప్రధానపాత్రలో నటించిన 'క్వీన్‌' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. కేవలం 20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 100కోట్లు వసూలు చేసి ట్రేడ్‌ పండితులను కూడా ఆశ్యర్యానికి గురిచేసింది. దీంతో ఈ చిత్రం దక్షిణాది భాషల్లో రీమేక్‌ హక్కులను తమిళ నటుడు, నిర్మాత, హీరో ప్రశాంత్‌ తండ్రి త్యాగరాజన్‌ భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నది కూడా విదితమే. కానీ ఈ చిత్రం బాలీవుడ్‌లో విడుదలై, బుల్లితెరపై కూడా ప్రదర్శితమై చాలా కాలమే అయింది. ఎట్టకేలకు ఇంత ఆలస్యంగా ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషల్లో రీమేక్‌కు సిద్దమైంది. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అదే సమయంలో మలయాళ రీమేక్‌లో అమలాపాల్‌, కన్నడ రీమేక్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌లు నటించనున్నారనే ప్రచారం మొదలైంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రీమేక్‌కు నటి, దర్శకురాలు రేవతి డైరెక్టర్‌గా, కన్నడలో మాత్రం ఉత్తమనటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక తెలుగు వెర్షన్‌లో ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై మాత్రం వార్తలు రావడం లేదు. ఈ చిత్రాన్ని అనవసరంగా ఇన్ని భాషల్లో వేర్వేరు హీరోయిన్లతో తీయడం వృథా ఖర్చుని, అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న ఒకే హీరోయిన్‌తో తీస్తే సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో? కాదో? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయకతప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ