Advertisementt

ధృవ విలన్ కు టాప్ సింగర్ వాయిస్..!

Fri 02nd Dec 2016 05:23 PM
dhruva movie,hero ram charan,aravind swamy,voice dubbing hemachandra,director surendar reddy  ధృవ విలన్ కు టాప్ సింగర్ వాయిస్..!
ధృవ విలన్ కు టాప్ సింగర్ వాయిస్..!
Advertisement
Ads by CJ

'రోజా, బొంబాయి' చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో... అరవింద్ స్వామి. అరవింద్ స్వామి చాలా రోజుల తర్వాత తెలుగులో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ధృవ చిత్రంలో  స్టైలిష్ విలన్ గా కనిపించనున్నాడు. రామ్ చరణ్ కి పోటీగా నటిస్తున్న అరవింద్ స్వామి ధృవ  ఒరిజినల్ వెర్షన్  ‘తనీ ఒరువన్‌’లో కూడా ఆయనే విలన్ గా నటించాడు. అయితే ‘తనీ ఒరువన్‌’లో అరవింద్ నటనకు ముగ్దులై డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో రామ్ చరణ్ తెలుగులో కూడా అరవింద్ స్వామితోనే విలన్ కేరెక్టర్ చేయించాలనుకుని అరవిందన్ తీసుకున్నారు.

ఇక అరవింద్ స్వామికి అసలు తెలుగు రాదు కాబట్టి తెలుగులో మంచి వాయిస్ వున్న వ్యక్తే డబ్బింగ్ చెప్పాలి. అందుకే అరవింద్ కి డబ్బింగ్ చెప్పడానికి ఒక సింగర్ ని తీసుకున్నారు. ఆ సింగర్ ఎవరో కాదు హేమ చంద్ర. హేమచంద్ర తో అరవింద్ స్వామికి కి డబ్బింగ్ చెప్పించారంట. అయితే హేమచంద్ర పెద్దగా ఎవరకి డబ్బింగ్ చెప్పడు. ఇక అరవవింద్ కి డబ్బింగ్ చెప్పమని అడగగానే ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక ఈ ధృవ చిత్రంలో హీరో పాత్రకి సరిసమానంగా విలన్ పాత్ర ఉంటుందనేది మనం ధృవ ట్రైలర్ లో చూసాం. ఇక ధృవ చిత్రం డిసెంబర్ 9 న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ