Advertisementt

రా,రా,ర హీరోల సస్పెన్స్..!

Fri 02nd Dec 2016 03:50 PM
ntr,ram,ravi teja,director karunakar,pm modhi,  రా,రా,ర హీరోల సస్పెన్స్..!
రా,రా,ర హీరోల సస్పెన్స్..!
Advertisement
Ads by CJ

ముగ్గురు రా,రా,ర హీరోలు కొత్త సినిమాలను ఫైనలేజ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా పెద్ద నోట్లను రద్దు చేసేముందు ఇంత కసరత్తు చేసి ఉండదు. ఇంతకీ ఆ హీరోలెవరంటే ఎన్టీ'రా'మారావు, 'రామ్', 'ర'వితేజ. ఈ ముగ్గురి పేర్లలో ర కామన్ గా ఉంది. చిత్రంగా వీరు పుంఖాలు పుంఖాలుగా కథలు వింటూనే ఉన్నారు. 

తాజా సమాచారం ఏమంటే ఎన్టీఆర్ సినిమా మాత్రం ఫైనల్ అయిందని అంటున్నారు. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.'హైపర్' తర్వాత రామ్ కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. కథలు వింటున్నాడు కానీ తలమాత్రం ఊపడం లేదు. అయితే కరుణాకరన్ దర్శకత్వంలో నటించడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఇక రవితేజ గురించి తెలిసిందే. ఆయన నటించిన 'బెంగాల్ టైగర్' గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది. అప్పటి నుండి ఎవరికీ కనిపించడం లేదు. సినీవేడుకలకు సైతం రావడం లేదు. రవితేజ సినిమాల గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, దేనికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా మంచి ఫామ్ లో ఉన్న హీరోలు ఇంతేసి గ్యాప్ తీసుకోవడం పట్ల నిర్మాతలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ బాగుకోసమైనా సరే ఎక్కువ సినిమాలు చేయాల్సిన  బాధ్యత హీరోలపై ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ