సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త హల్ చెల్ చేస్తోంది. మురగదాస్ డైరెక్షన్లలో మహేష్ నటిస్తున్న తాజా సినిమా శాటిలైట్ హక్కులను ఏకంగా 26 కోట్లకు అమ్మేశారనేది ఆ వార్త. ఇది నిజమేనా..! లేక ప్రచారం కోసం చేసిందా..? అనే అనుమానం కూడా చాలామందిలో కలుగుతోంది. ఎందుకంటే టాలీవుడ్ చరిత్రలో లేని అంకె ఇది. ఎంతో నమ్మకంతో తీసుకున్న 'బ్రహ్మోత్సవం' తీవ్ర నిరాశపరిచింది. టీవీలో ప్రసారం చేస్తే అట్టడుగు స్థాయి రేటింగ్ వచ్చింది. అలాంటప్పుడు మహేష్ కొత్త చిత్రానికి క్రేజ్ ఎందుకని ఉంటుంది.? దీనికి మురగదాస్ దర్శకత్వం వహించడమే కారణమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మహేష్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు కాబట్టి రెండు భాషలకు కలిపి 26 కోట్లకు హక్కులు అమ్మివుంటారనే అనుమాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. లేదా సినిమాపై బయ్యర్లలో క్రేజ్ కల్పించడం కోసమైనా చేసుండాలి. ప్రస్తుతం టీవీ సంస్థలు పెద్ద నోటు రద్దుతో ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. స్పాన్సర్లు దొరకడం కష్టం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మహేష్ సినిమా భారీ స్థాయిలో అమ్ముడవుతే మాత్రం అది సంచలన వార్తే అవుతుంది.