బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్‌ఖాన్‌కు 'చెన్నైఎక్స్‌ప్రెస్' తర్వాత సరైన హిట్ లేదు. ఆయన చిత్రాలన్నీ వరసగా నిరాశపరుస్తూ వస్తున్నాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. దాంతో ఆయనతోపాటు ఆయన అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. అయితే తాను కరణ్‌జోహార్‌తో కలిసి నిర్మించి, గౌరీషిండే దర్శకత్వంలో చడీచప్పుడు లేకుండా, కేవలం 30కోట్ల బడ్జెట్‌తో విడుదల చేసిన 'డియర్ జిందగీ' చిత్రం షారుఖ్ మొహంలో మరలా చిరునవ్వును తెచ్చింది. ఓ టీనేజ్ అమ్మాయికి, మిడిల్ ఏజ్ వ్యక్తితో బంధం ఎలా ఏర్పడింది?అనే పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్, అలియాభట్‌ల మద్య కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఈ చిత్రం నవంబర్ 25న విడుదలైంది. ఐదు రోజుల్లో ఈ చిత్రం 70కోట్లు వసూలు చేసింది. భారత్‌లో కంటే ఓవర్‌సీస్‌లో రెండురోజులు ముందుగా విడుదలైన ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో 32కోట్లు వసూలు చేయగా, ఇండియాలో 38కోట్లను వసూలు చేసింది. షారుఖ్ స్థాయి కలెక్షన్లు రాకపోయినా లోబడ్జెట్‌లో రూపొందిన చిత్రం కావడం, ఇప్పటికే బడ్జెట్‌కు రెండింతలు పైగా వసూలు చేయడంతో నిర్మాత షారుఖ్‌తో పాటు నిర్మాణ భాగస్వామి రణ్‌జోహార్‌లే కాదు... బయ్యర్లకు కూడా రూపాయికి రెండు రూపాయలు లాభం తీసుకొనిరావడంతో అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. దీంతో జనవరిలో విడుదలకు సిద్దమవుతోన్న షారుఖ్ 'రాయిస్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.