గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రూటే సపరేటు. ఆయన ఏది చేసినా అందులో వ్యాపార కోణం ఉంటుందని సన్నిహితులు అంటుంటారు. తాజాగా మేనల్లుడు రామ్ చరణ్ తో తీస్తున్న 'ధృవ' ప్రమోషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాడని తెలిసి ఆడియో వేడుక నిర్వహించలేదు. చంద్రబాబు అండ్ కోను దూరం పెట్టడం కోసం 'ధృవ' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ కే పరిమితం చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసన్నం కోసం ఈ వేడుకకు కేటీఆర్ ను అతిథిగా ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు.
చిరంజీవికి, అల్లు అరవింద్ కు వారి వియ్యంకులకు తెలంగాణలోనే వ్యాపారుల, స్థిరాస్తులు ఉన్న విషయం తెలిసిందే. పైగా అల్లు వియ్యంకుడు కేసీఆర్ కు సన్నిహితులు . ఆయన ద్వారానే కేటీఆర్ ను కలిసి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వాంచినట్టు సమాచారం. ఇలాంటి తెలివితేటలు కేవలం అల్లు అరవింద్ కు మాత్రమే ఉంటాయి.ఆయన అపర చాణక్య నీతి ప్రదర్శించారు. ఇదంతా చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి తన రాజ్యసభ సభ్యత్వం ముగిసాక రాజకీయాల జోలికి వెళ్ళరేమో అనిపిస్తోంది. ఇప్పటికే ఆయన పదవిని అనుభవిస్తూ, ప్రజల గురించి ఆలోచించడం మానేశారు.