Advertisementt

ఇది నిజంగా రాజమౌళి అదృష్టమనే చెప్పాలి..!

Thu 01st Dec 2016 11:53 AM
director rajamouli,hero prabhas,heroine tamanna,anushka,baahubali 2 movie,rajamouli father k. v. vijayendra prasad  ఇది నిజంగా రాజమౌళి అదృష్టమనే చెప్పాలి..!
ఇది నిజంగా రాజమౌళి అదృష్టమనే చెప్పాలి..!
Advertisement
Ads by CJ

ఓ ప్రాంతీయ భాషాచిత్రంగా రూపొందిన రాజమౌళి 'బాహుబలి1' భాషా బేధాలు లేకుండా అన్ని భాషల్లోనూ అత్యద్బుతమైన స్పందనను రాబట్టి ఏకంగా 600కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి, టాలీవుడ్‌కి దేశ, విదేశాల్లో కూడా పేరుప్రఖ్యాతులను, గుర్తింపును తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌ 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' పేరుతో అంతకు మించి ప్రభంజనం సృష్టించడానికి రాజమౌళి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్‌ చివరి దశకు వచ్చిన ఈ చిత్రం సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను కూడా జరుపుకుంటోంది. కాగా ఈ పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌లో వందలాది మంది పాల్గొంటున్నారు. వీరిలో ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్ధం కాని పరిస్థితుల్లో రాజమౌళి మరింత గట్టి భద్రతా చర్యలను తీసుకుంటున్నాడు. కాగా ఇటీవలే ఈ చిత్రంలోని కొన్ని యుద్ద సన్నివేశాలను, ప్రభాస్‌, అనుష్కల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌లోని కొన్ని క్లిప్పింగ్స్‌ను ఎడిటింగ్‌ విభాగంలో పనిచేసే వ్యక్తే బయటకు లీక్‌ కావడం సంచలనం సృష్టించింది. కానీ ఈ విషయంలో రాజమౌళి, ఆయన నిర్మాతలు కాస్త అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మొదటి పార్ట్‌లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే అంశాన్ని సస్పెన్స్‌గా ఉంచారు. ఈ అంశం అన్ని భాషా ప్రేక్షకులలోనూ క్యూరియాసిటీని కలిగించడంతో దీనిపై అన్నిచోట్ల పెద్ద చర్చ నడుస్తోంది. కాగా దీనిని ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌లో రివీల్‌ చేయనున్నారు. ఇందుకోసం ఐదు రకాల రీజన్స్‌ను రచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ చేత రాయించి, అందులో బెస్ట్‌గా నిర్ణయించిన వెర్షన్‌ను చిత్రీకరించారు. మరి అదే ఈ లీకేజీలో ఆ లీకైన సీన్స్‌లో ఈ సస్పెన్స్‌ను రివీల్‌ చేసే అంశాలు ఉండి ఉంటే ఈ చిత్రంపై ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోయి, దాని ఎఫెక్ట్‌ ఈ చిత్రం విజయంపై, బిజినెస్‌పై తీవ్రప్రభావం చూపి ఉండేది. ఈ విషయంలో నిజంగా రాజమౌళి, అతని నిర్మాతలు అదృష్టవంతులేనని చెప్పొచ్చు. కాగా ఇదే అభిప్రాయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్‌ కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ