శంకర్ తాను తీసే ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా, తాననుకున్న విధంగా చిత్రీకరించేవరకు రాజీపడడు. కాగా ఆయన కేవలం సినిమాలోని సీన్స్‌పైనే కాదు.. ఫైట్స్, సాంగ్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు. ఓ పాటలో ఎక్కడెక్కడి దేశాలలోనో ఉన్న ప్రపంచంలోని ఏడు వింతలను చూపించి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలాగే ఆయన చిత్రాలలోని ప్రతి పాటా విజువల్‌గా వండర్‌ఫుల్‌గా ఉండేలా, ప్రేక్షకులను మైమరిపించే విధంగా విదేశాలలోని ఎవ్వరూ తీయని లొకేషన్లు, ఎవ్వరికీ సాధ్యం కాని అద్భుతమైన సెట్స్‌ను వేయించి అబ్బురపడేలా చేస్తూ ఉంటాడు. అలాంటి శంకర్ ఇప్పుడు తాజాగా తాను తీస్తున్న '2.0' చిత్రం కోసం మరో సంచలనానికి తెరతీస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీ, అమీజాక్సన్‌లపై వచ్చే రెండు రొమాంటిక్ సాంగ్స్‌ను ఆయన ఉక్రెయిన్ దేశంలోని పలు సరికొత్త లొకేషన్లలో తీయాలని భావించి, ఆ దేశం వెళ్లి లోకేషన్స్‌ను కూడా సెలక్ట్ చేసుకొని వచ్చాడు. కానీ ప్రస్తుతం రజనీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన్ను తీసుకొని అంత దూరం వెళ్లడం మంచిది కాదని నిర్ణయించాడు. అయినా సరే రాజీపడకుండా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించిన ఈ రెండు పాటలలో ఆ దేశపు లోకేషన్లను మిక్స్ చేసి ఒరిజినల్‌గా ఆ దేశంలోని అందమైన లొకేషన్లలోనే ఆ పాటను రియల్‌గా చిత్రీకరించినట్లుగా రెడీ చేయడానికి సిద్దమవుతుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.