Advertisementt

'బాహుబలి' ఎఫెక్ట్‌తో స్టార్స్‌ మారుతున్నారు!

Wed 30th Nov 2016 03:30 PM
star heroes,visuval effects,rajamouli,shankar,bahubali,2.0 movie,nagarjuna  'బాహుబలి' ఎఫెక్ట్‌తో స్టార్స్‌ మారుతున్నారు!
'బాహుబలి' ఎఫెక్ట్‌తో స్టార్స్‌ మారుతున్నారు!
Advertisement

గతంలో ఎప్పుడో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మోరు, దేవి, అంజి, దేవీపుత్రుడు, అరుంధతి' వంటి చిత్రాలలోనే విజువల్‌ ఎఫెక్ట్స్‌కు పెద్ద పీట వేసి, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాని కాలంలోనే గ్రాఫిక్స్‌ వంటి వాటికి ఆయన ప్రాధాన్యత పెంచిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రం మాత్రం ఇప్పుడు అందరిలోనూ గుబులురేపుతోంది. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా కొత్త సరిహద్దులను ఈ చిత్రం నిర్దేశించింది. దీంతో 'బాహుబలి' స్టాండర్డ్‌లో తమ చిత్రాలను కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఎఫెక్టివ్‌గా, సమర్దవంతంగా, ఆ చిత్రం స్ధాయికి ఏమాత్రం తగ్గకుండా తమ చిత్రాలు ఉండేలా స్టార్స్‌ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం వారు దర్శకనిర్మాతలకు సినిమా విడుదల విషయంలో కాస్త సమయం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. క్వాలిటీ కోసం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులకు భారీగానే సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ విషయంలో ముందుగా క్రిష్‌ను చెప్పుకోవాలి. ఆయనపై బాలయ్య ఎలాంటి షరత్తులు విధించనప్పటికీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'ను విజువల్‌ ఎఫెక్ట్స్‌పరంగా కాంప్రమేజ్‌ కాకుండా, అదే సమయంలో తాము అనుకున్న తేదీకే చిత్రాన్ని విడుదల చేసేలా కృషి చేస్తున్నాడు. ఇక 'బాహుబలి2'ని పార్ట్‌ 1 కంటే వందశాతం ఎక్కువ క్వాలిటీతో తీస్తున్నామని రాజమౌళితో పాటు రానా వంటి యూనిట్‌ సభ్యులు కూడా చెప్పుకొచ్చారు. షూటింగ్‌ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ పార్ట్‌2 పోస్ట్‌ప్రొడక్షన్ కోసం రాజమౌళి అండ్‌ టీం కూడా భారీ సమయాన్ని వెచ్చిస్తోంది. 

ఇక రాజమౌళి 'మగధీర'కు ముందే శంకర్‌ తన చిత్రాలను విజువల్‌ వండర్స్‌గా తీర్చిదిద్దాడు. ఇక 'రోబో' 'ఐ' వంటి చిత్రాలను కూడా టెక్నికల్‌గా అదిరిపోయేలా తీశాడు. ఇక 'బాహుబలి' చిత్రంలో చూపించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ధీటుగా 'బాహుబలి' పార్ట్‌2ని మించిన స్థాయిలో ఆయన తాజా చిత్రం '2.0' లో ఎఫెక్ట్స్‌ ఉంటాయని టాక్‌. అందుకే ఆయన 'బాహుబలి' పార్ట్‌2 విడుదల తర్వాతే అంటే వచ్చే దీపావళికే తన చిత్రాన్ని విడుదల చేయాలని, కావాల్సివస్తే మరలా కొన్ని సీన్స్‌ను విజువల్‌గా మరింత పటిష్టంగా ఉండటం కోసమే రాజమౌళి చిత్రం వచ్చిన కొన్ని నెలల తర్వాతనే తన చిత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా నాగార్జున కూడా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయినా విడుదల విషయంలో తొందరపడటం లేదు. ఆయన మాట్లాడుతూ, తమ చిత్రానికి కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో చాలా ప్రాధాన్యం ఉందని తెలుపుతూనే, ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుందనే విషయాన్ని దాటవేసి, తాను విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కూడా శాటిస్‌ఫై అయ్యేవరకు చిత్రాన్ని విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇవ్వన్నీ చారిత్రక నేపధ్యం ఉన్న బయోపిక్స్‌ లేదా సైన్స్‌ఫిక్షన్స్‌ కావడంతో అందుకోసం వారు ఇలా కష్టపడుతున్నారు. కాగా సోషల్‌ మేసేజ్‌తో తీసే మామూలు చిత్రమైనప్పటికీ మురుగదాస్‌, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి కూడా మహేష్‌ను ఒప్పించి, మురుగదాస్‌ పోస్ట్‌ప్రొడక్షన్‌కు భారీగా సమయం వెచ్చిస్తున్నాడు. షూటింగ్‌ త్వరగానే పూర్తయ్యే అవకాశాలున్నప్పటికీ విడుదల మాత్రం మే లేదా జూన్‌లో ఉంటుందని సమాచారం. ఇలా ఇప్పుడు మన హీరోలందరికీ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై విపరీతమైన ఆసక్తి పెరిగిపోయిందనే చెప్పాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement