మహేష్ ఇప్పటివరకు 22 సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు 23 వ సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. 23 వ చిత్రం కంప్లీట్ కాకుండానే 24 వ సినిమాని కూడా లైన్ లో పెట్టేసాడు. మహేష్ తన 24 వ చిత్రాన్ని శ్రీమంతుడు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలతోనే మళ్ళీ చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. మురుగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే మహేష్ కొరటాల శివ సినిమాలో నటిస్తాడు. ప్రస్తుతం నటించిన సినిమాల్లో డిఫ్రెంట్ డిఫ్రెంట్ గెటప్స్ లో కనిపించిన మహేష్.. కొరటాల కాంబినేషన్ లో చేసే చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ సినిమా అయిన 25 వ సినిమా ఎవరితో చేస్తాడా అని అప్పుడే చర్చ మొదలైంది. ఇక 25 వ సినిమా ఏ దర్శకుడితో నటిస్తాడో అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు.
అయితే మహేష్ పివిపి బ్యానేర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమా ఉంటుందని పివిపి ప్రకటించాడు. కానీ మహేష్ మాత్రం ఈ సినిమాపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ సినిమా ఉంటుందో లేదో కూడా డౌటే. మరి ఈ చిత్రం గనక పట్టాలెక్కకపోతే మహేష్ తన 25 వ చిత్రం ఏ డైరెక్టర్ తో చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ కూడా తన 25వ చిత్రం కొంచెం స్పెషల్ గా ఉండాలని ఆలోచిస్తున్నాడట. అందుకే ఎటువంటి తొందరా లేకుండా కూల్ గా ఈ సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. మరి మహేష్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.