Advertisementt

రెస్ట్‌ కోసం రెస్ట్‌లెస్‌గా పనిచేస్తోన్న మహేష్‌..!

Wed 30th Nov 2016 12:44 PM
mahesh babu,rest less,murugadoss,new year celebrations  రెస్ట్‌ కోసం రెస్ట్‌లెస్‌గా పనిచేస్తోన్న మహేష్‌..!
రెస్ట్‌ కోసం రెస్ట్‌లెస్‌గా పనిచేస్తోన్న మహేష్‌..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌.జె.సూర్య వంటి వారితో దక్షిణాది టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన మురుగదాస్‌ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రం చెన్నై, హైదరాబాద్‌ వంటి చోట్ల షెడ్యూల్స్‌ జరుపుకుంది. కాగా తాజా షెడ్యూల్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్‌ మొత్తం 20 డేస్ సాగుతుంది. ఇందులో మహేష్‌, రకుల్‌, విలన్ల మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ పీటర్‌హెయిన్స్‌ ఆద్వర్యంలో తెరకెక్కుతున్నాయి. ఈ ఎపిసోడ్స్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేసే ఛేజింగ్‌ సీన్స్‌ ఉంటాయని, ఇవే ఈ చిత్రానికి ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు కూడా షూటింగ్‌ స్పాట్‌లోనే ఉంటూ ఖర్చుకు వెనుకాడకుండా కావల్సినవన్నీ అందిస్తున్నారు. ఇక ఈ తాజా షెడ్యూల్‌ డిసెంబర్‌ 23 వరకు జరగనుంది. అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్‌లోని పలు లోకేషన్లలో షూటింగ్‌ జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని మహేష్‌బాబు రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు. కాగా ఈ షెడ్యూల్‌ 23వ తేదీన పూర్తయితే మహేష్‌కు ఓ పదిరోజులు బ్రేక్‌ లభిస్తుంది. ఈసారి క్రిస్మస్‌, నూతన సంవత్సరం వేడుకలను వేడుకగా జరుపుకోవాలని మహేష్‌ ప్లాన్‌ చేశాడు. ఉంటే షూటింగ్‌లలో, బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిజీగా ఉండే మహేష్‌ బ్రేక్‌ వస్తే మాత్రం దానిని పూర్తిగా తన కుటుంబంతోనే గడుపుతాడనేది తెలిసిన సంగతే. కాగా ఈసారి ఆయన క్రిస్మన్‌, న్యూఇయర్‌ వేడుకలను ఫ్యామిలీతో కలిపి లండన్‌లో ప్లాన్‌ చేశాడు. దీనికోసం ఆయన ప్రస్తుతం షూటింగ్‌లో రెస్ట్‌లెస్‌గా కష్టపడుతున్నాడు. ఈ ఫ్యామిలీ ట్రిప్‌ 10రోజులు ఉంటుంది. ఆ వెంటనే ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఈ చిత్రం హైదరాబాద్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ