Advertisementt

రకుల్‌ మనసు దోచుకున్న మెగాహీరో..!

Wed 30th Nov 2016 12:29 PM
rakul preet singh,sai dharam tej,dhruva movie,brusli movie,ramcharan  రకుల్‌ మనసు దోచుకున్న మెగాహీరో..!
రకుల్‌ మనసు దోచుకున్న మెగాహీరో..!
Advertisement
Ads by CJ

మెగాక్యాంప్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంటూ, మరోవైపు ఇతర స్టార్‌హీరోల దృష్టిని సైతం తనపై పడేలా చేసుకుంటూ టాప్‌హీరోయిన్‌గా దూసుకపోతున్న హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. కాగా ఈమె ఇప్పటికే బన్నీ, రామ్‌చరణ్‌లతో కలిసి నటించింది. త్వరలో విడుదల కానున్న చరణ్‌ మరోచిత్రం 'ధృవ'లో కూడా మరోసారి ఈమె ఆయనతో జతకడుతోంది. ఆమెతో కలిసి నటించిన 'బ్రూస్‌లీ'చిత్రం డిజాస్టర్‌ అయినప్పటికీ బన్నీతో ఆమె నటించిన 'సరైనోడు' ఇచ్చిన ధైర్యంతో చరణ్‌ ఆమెతో మరోసారి రొమాన్స్‌ చేశాడు. తాజాగా ఆమె అప్‌కమింగ్‌ మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో 'విన్నర్‌' చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధులు నిర్మిస్తుండగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఉక్రెయిన్‌, టర్కీలలో ఇటీవలే పూర్తయింది. కాగా అక్కడ ఈ చిత్రంలోని రెండు డ్యూయెట్‌ సాంగ్స్‌ను, మరికొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్‌ సీన్‌ను కూడా చిత్రీకరించారు. అక్కడి రేసుకోర్స్‌ కోర్టులో హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్ల నేతృత్వంలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీశామని, ఈ సీక్వెన్స్‌ క్లైమాక్స్‌ వస్తుందని, ఈ యాక్షన్‌ సీన్స్‌ మన ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురిచేస్తాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కాగా ఈ విదేశీ షెడ్యూల్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగిందని సమాచారం. సాయి, రకుల్‌ల మధ్య ఓ డ్యూయెట్‌ను చిత్రీకరిస్తుండగా, ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్‌మలినేని తమషాగా రకుల్‌కు చెందిన పర్సనల్‌ బ్యాగ్‌ను తీసి చూశాడట. అందులో సాయిధరమ్‌తేజ్‌ ఫొటో ఆయనకు కనిపించే సరికి షాకయ్యాడని, ఈ విషయాన్ని హీరో సాయికి చెప్పగా ఆయన యూనిట్‌ అందరి ముందు రకుల్‌ను ఆటపట్టించడంతో ఈ సీక్రెట్‌ యూనిట్‌ మొత్తానికి తెలిసిపోయిందిట. దీంతో సాయిపై నొచ్చుకున్న రకుల్‌ ఈ విషయంపై అక్కడే వివరణ ఇచ్చి వెళ్లిపోయిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆమె ఇచ్చిన వివరణ ఏమిటో మాత్రం తెలియడం లేదు. మొత్తానికి ఈ సీక్రెట్‌ను అందరికీ ఓపెన్‌ చేసి సాయి రకుల్‌ అభిమానాన్ని బట్టబయలు చేసి ఆమెను హర్ట్‌ చేశాడంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ