Advertisementt

ఇరకాటంలో మాస్‌డైరెక్టర్‌..!

Wed 30th Nov 2016 11:50 AM
director boyapati srinu,director krris,mega star chiranjeevi,balakrishna,bellamkonda srinivas,chiranjeevi 151 movie,balakrishna 101 movie  ఇరకాటంలో మాస్‌డైరెక్టర్‌..!
ఇరకాటంలో మాస్‌డైరెక్టర్‌..!
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను... ఈయన మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకుంటున్నారు. వినాయక్‌ తర్వాత మాస్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో ఈయన దూసుకుపోతున్నాడు. పవర్‌ఫుల్‌ కథలను అంతే ఎఫెక్టివ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేసే ఈ దర్శకుడితో ప్రతి హీరో ఓ చిత్రం చేయాలని ఆరాటపడుతున్నారు. సీనియర్‌స్టార్స్‌ నుండి యువ హీరోల వరకు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇక బాలకృష్ణతో ఆయన చేసిన 'సింహా,లెజెండ్‌' చిత్రాలను ఎంతో అగ్రెసివ్‌గా ప్రజెంట్‌ చేసి, బాలయ్య వంటి సీనియర్‌ అండ్‌ మాస్‌ స్టార్‌కు పెద్ద హిట్లిచ్చిన ఈ యువదర్శకుడు ఇటీవల వచ్చిన బన్నీ 'సరైనోడు'ను కూడా అంతే మాస్‌ టచ్‌లో చూపించి, యువ హీరోల దృష్టిని కూడా తనవైపుకు తిప్పుకున్నాడు. తాజాగా ఆయన భారీ రెమ్యూనరేషన్‌ తీసుకొని, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా 'సరైనోడు' చిత్రం ఫంక్షన్‌లో బోయపాటి పనితనాన్ని మెచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి సైతం బోయపాటితో ఓ చిత్రం చేస్తానన్నాడు. కాగా ప్రస్తుతం ఆయన వినాయక్‌ దర్శకత్వంలో చేస్తున్న 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌150' తర్వాత బోయపాటి దర్శకత్వంలోనే గీతాఆర్ట్స్‌ బేనర్‌లో తన 151వ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు మరో సీనియర్‌స్టార్‌ బాలకృష్ణ సైతం తన ప్రతిష్టాత్మక వందో చిత్రాన్ని మొదట బోయపాటి దర్శకత్వంలోనే చేయాలని భావించాడు. ఆయన అభిమానులు సైతం అందుకు పెద్ద ఎత్తున బాలయ్యపై ఒత్తిడి తెచ్చారు. కానీ బాలయ్య మాత్రం తన వందో చిత్రాన్ని స్పెషల్‌గా ఉండేలా చారిత్రాత్మక చిత్రమైన 'గౌతమిపుత్రశాతకర్ణి' ని క్రిష్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తన 101వ చిత్రంగా ఆయన కృష్ణవంశీ డైరెక్షన్‌లో 'రైతు' చిత్రం చేయాలనుకున్నాడు. కానీ ఈ చిత్రం వాయిదాపడింది. కారణాలు ఏవైనా ఈ చిత్రం ప్రస్తుతానికి లేనట్లే. బాలయ్య సైతం తన 100వ చిత్రాన్ని 'గౌతమీపుత్రశాతకర్ణి'గా చేస్తూ, ఆ వెంటనే 'రైతు' వంటి సోషల్‌మేసేజ్‌ ఉన్న చిత్రంగా కంటే దాని స్దానంలో ఓ పక్కా మాస్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం చేయాలనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం. దాంతో ఈయన తాజాగా బోయపాటికి ఫోన్‌ చేసి తన 101వ చిత్రానికి స్టోరీ సిద్దం చేయమని ఆదేశించాడని టాక్‌. సంక్రాంతికి బాలయ్య,చిరుల చిత్రాలు విడుదల కానున్నాయి. కానీ బోయపాటి మాత్రం బెల్లకొండ చిత్రం పూర్తి చేయడానికి మూడునాలుగు నెలలు పడుతుంది. అప్పటివరకు బోయపాటి కోసం వెయిట్‌ చేయడానికి చిరు, బాలయ్య ఇద్దరు సిద్దంగా ఉన్నారు. కానీ వీరిలో ఎవరి చిత్రాన్ని బోయపాటి ముందుగా చేస్తాడో? ఏ స్టార్‌ను వెయిటింగ్‌లో పెడతాడోనన్న విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ