Advertisementt

సినిమా ఆఫర్స్ కోసం ఇంతగా దిగజారాలా..!

Tue 29th Nov 2016 06:02 PM
anchor rashmi gautam,jabardasth,cinema offers,frank calls to rashmi gautam  సినిమా ఆఫర్స్ కోసం ఇంతగా దిగజారాలా..!
సినిమా ఆఫర్స్ కోసం ఇంతగా దిగజారాలా..!
Advertisement
Ads by CJ

హాట్ యాకర్ రష్మీ అంటే అందరికి పరిచయమే. ఈ టీవీ జబర్దస్త్ ప్రోగ్రాం తో పాపులర్ అయిన రష్మీ గౌతమ్ మెల్లగా వెండితెర ఆఫర్స్ ని కూడా అందిపుచ్చుకుని అటు హీరోయిన్ అవతారమెత్తింది. సినిమాల్లో లెక్కకు మించి అందాలు ఆరబోస్తూ హాట్ గా రెచ్చిపోయిన రష్మీకి ఇప్పుడు ఆఫర్స్ పెద్దగా లేక కేవలం బులితెరమీదే బిజీగా వుంది. అయితే హాట్ హీరోయిన్ ముద్ర వేయించుకున్న రష్మిని కొంతమంది ఆకతాయిలు ఫోన్ చేసి ఏడిపిస్తున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా రష్మీనే చెప్పింది. తన అభిమానులే తనని వేధిస్తున్నారని చెబుతోంది. రోజు తన సెల్ కి ఫోన్ చేసి వారు తనని బాగా ఇబ్బంది పెడుతున్నారని చెబుతోంది. రోజుకి కనీసం 50 పైగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయని చెబుతోంది.

షూటింగ్స్ తో బిజీగా వుండే తనకు ఈ కాల్స్ వల్ల చిరాకు వస్తుందని అంటుంది. ఇక ఈ కాల్స్ నుండి తప్పించుకోవడానికి తన మొబైల్ నెంబర్ మారుద్దామంటే ఈ నెంబర్ అందరిదగ్గర ఉందని.... సో తనకి ప్రొడ్యూసర్స్ కాల్స్ చెయ్యాల్సి వస్తే కొత్త నెంబర్ తెలియక ఇబ్బందిపడతారనే ఉద్దేశ్యం తో నెంబర్ మార్చలేకపోతున్నాని చెప్పుకొస్తుంది. వీటివల్ల తాను చాలా విసిగిపోయానని చెబుతుంది. మరో పక్క రష్మీ మాటలను క్రిటిక్స్ కొట్టిపడేస్తున్నారు. అసలు రష్మీకి సినిమాల్లో ఆఫర్స్ రావడమే లేదు. ఏదో బుల్లితెర మీద కాస్త బిజీగా ఉందంతే. సినిమాల్లో ఆఫర్స్ కోసమే ఇలా చేస్తోంది రష్మీ.. అని అంటున్నారు. అంతే కాదు సినిమాల్లో ఛాన్సులు లేక మీడియా తన మీద ఫోకస్ తగ్గించిందని... ఇక ఫోకస్ తగ్గితే కష్టమని... అందుకే రష్మీ ఇలా పబ్లిసిటీ కోసమే చేస్తుందని అంటున్నారు. మరి రష్మీ ఆఫర్స్ కోసం ఇంతలా దిగజారాలా అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ