Advertisement
TDP Ads

'రైతు' ఆగడానికి రీజన్ ఇదేనా..?

Tue 29th Nov 2016 01:48 PM
rythu,rythu movie stopped,balakrishna,amitabh bachchan,krishna vamsi  'రైతు' ఆగడానికి రీజన్ ఇదేనా..?
'రైతు' ఆగడానికి రీజన్ ఇదేనా..?
Advertisement

బాలకృష్ణ 'రైతు' సినిమా ఆగిపోయినట్టేనా? అవుననే చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలకృష్ణ - కృష్ణవంశీ కాంబినేషన్లో బాలకృష్ణ 101 వ సినిమాగా రైతు సినిమా తెరకెక్కనుందని అనౌన్సమెంట్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణతో కలిసి నటింపచేసేందుకు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ని కూడా కలిశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఇక అమితాబ్ కూడా రైతు చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడని అప్పట్లో టాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే అక్కడ ముంబైలో సర్కారు సినిమా సెట్స్ లో జరిగిన విషయం వేరట. అక్కడ సర్కార్ సెట్స్ లో బాలకృష్ణ, కృష్ణ వంశీ ఇద్దరూ కలిసి మర్యాదపూర్వకం గా అమితాబ్ ని కలిసి తన రైతు సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించమని అడిగారట. దానికి అమితాబ్ తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని అవి పూర్తికావాలంటే చాలా టైం పడుతుందని చెప్పారట. ఇక అంతకాలం రైతు చిత్రం వాయిదా వెయ్యడం ఇష్టం లేని బాలయ్య వేరే చిత్రానికి కమిట్ అయినట్లు వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు అమితాబ్ కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రం ఆగలేదంట. అసలు అమితాబ్ తనకి ఉన్న కమిట్మెంట్స్ విషయం బాలయ్యతోగాని, కృష్ణవంశీ తో గాని అస్సలు చెప్పలేదంట. కానీ రైతు లో నటించడం మాత్రం కుదరదని చెప్పాడట. అసలు అమితాబ్ అలా డైరెక్ట్ గా ఎలా చెప్పగలిగాడు. ఒక మంచి సందేశాత్మక చిత్రం లో ఒక మంచి పాత్ర తనని వెతుక్కుంటూ వస్తే అమితాబ్ ఎలా నో చెప్పగలిగాడని ఇప్పుడు మీడియా లో తెగ చర్చించుకుంటున్నారు. అయితే అమితాబ్ రైతు చిత్రం లో నటించననడానికి  ఒక బలమైన కారణం ఉందట. అదేమిటంటే అమితాబ్ పేరు రాష్ట్రపతి రేస్ లో వుండడమేనంట. ఇక రైతు చిత్రం లో కూడా అమితాబ్ కేరెక్టర్ రాష్ట్రపతి గా ఉందట. మరి నిజంగా రాష్ట్రపతి రేస్ లో పేరు పరిశీలనలో వున్నప్పుడు అటువంటి కేరెక్టర్ లో ఒక సినిమా చెయ్యడం బాగోదని... అందుకే రైతు లో నటించడానికి నో చెప్పాడని వార్తొకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. మరి బాలయ్యేమో అమితాబ్ లేకుండా రైతు లేదంటున్నాడు. కృష్ణ వంశీయేమో ఎలాగైనా రైతు చిత్రాన్ని తెరకెక్కించాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. చూద్దాం ఏమవుతుందో.?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement