తమ హీరోపై అభిమానం ఎంతైనా ఉండొచ్చు. ఎన్నో పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ మిగతా హీరోలు హర్ట్ అయ్యేట్టు మాట్లాడితేనే కొందరు నొచ్చుకుంటారు. సరిగ్గా ఇదే పనిచేశాడు దర్శకుడు క్రిష్. తన కొత్త చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' కథానాయకుడు బాలకృష్ణ అంటే ముచ్చటపడుతున్నాడు. 'శాతకర్ణి పాత్రని బాలకృష్ణ తప్ప మరెవరూ చేయలేరు' అని అనేశాడు. ఈ మాట ఇతర హీరోల అభిమానులకు రుచించడం లేదు. బాలకృష్ణ అద్భుతంగా నటించి ఉండవచ్చు. కానీ ఆయన మాత్రమే చేయగలడు అని చెప్పడం సరికాదని అభిమానులు అంటున్నారు.
ఉదహరణకి తెలుగులో హిట్ అయిన అనేక చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ చేసినపుడు అక్కడి హీరోలు నటించారు. అంటే ఒక పాత్రని మరో హీరో పోషించినా న్యాయం చేయగలడనేది వారి ఉద్దేశం. బాలకృష్ణ నటించిన 'లక్ష్మీనరసింహా' అనే చిత్రం తమిళ మాతృకలో విక్రమ్ నటించాడనే విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు.
క్రిష్ భవిష్యత్తులో ఇతర హీరోలతో పనిచేసినప్పుడు ఆయన చేసిన ప్రకటన ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.