Advertisementt

కాటమరాయుడు ఇక మారడు..!

Tue 29th Nov 2016 11:09 AM
power star pawan kalyan,katamarayudu movie,shruti haasan,director kishore kumar pardasani,dolly  కాటమరాయుడు ఇక మారడు..!
కాటమరాయుడు ఇక మారడు..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలు రెండు తనకి ఇంపార్టెంట్ అని తెగేసి చెప్పాడు. అన్నట్టుగానే అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీ అయ్యాడు. రాజకీయాల్లో సభలు ,సమావేశాలతో బిజీ అయిన పవన్ సినిమాల్లో కూడా రెండు, మూడు సినిమాలు పూజ కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇక రాజకీయాల్లో బిజీ అయ్యాక మొట్టమొదట పవన్ డాలి డైరెక్షన్ లో కాటమరాయుడు చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుండి ఏవేవో కథలు వినిపిస్తున్నాయి. కథలు అంటే పవన్ కాటమరాయుడు సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో వేలుపెడుతున్నాడని... ఇక ఎప్పుడుబడితే అప్పుడు కోపం తెచ్చుకుని సెట్ నుండి పవన్ వెళ్ళిపోతున్నాడని.... ఇక డైరెక్టర్ డాలి ని కూడా పవన్ లెక్కచేయడం లేదని అబ్బో ఒకటేమిటి చాల కథలే ప్రచారంలోకొచ్చాయి. అసలు సినిమా మొదలవ్వక ముందే ఈ సినిమాకి ఎస్.జె సూర్య డైరెక్టర్ గా చేస్తాడనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎస్.జె సూర్య స్థానం లోకి డాలి వచ్చి చేరాడు. ఇక డాలి పరిస్థితి కూడా కాటమరాయుడు సెట్స్ లో ఏమాత్రం బాగాలేదని ఒకటే గుసగుసలు. ఇక ఇప్పుడు శృతి హాసన్ తో ఏదో ప్రాబ్లెమ్ అంటున్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని అంటున్నారు. మరి పవన్ ఎందుకిలా ఈసినిమా విషయంలో వేళ్ళు పెట్టి గెలుకుతున్నాడో మరి. అసలు ఈ సినిమాని పవన్ తన పాతసినిమాలు జానీ, సర్దార్ లాగ చేసి ఈ సినిమాకి కూడా ప్లాప్ ముద్ర వేయించేసేలా వున్నాడని సినిమా ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ