'శివపుత్రుడు, అపరిచితుడు'లతో పాటు పలు చిత్రాలలో నటించిన చియాన్ విక్రమ్‌కు కోలీవుడ్, టాలీవుడ్‌లలో కూడా మంచి గుర్తింపు ఉంది. విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ నటునిగా ఇప్పటికే ఆయన కమల్‌హాసన్ తర్వాత ఆ స్థాయిలో తన పాత్రల కోసం కష్టపడి, అందులో ఒదిగిపోయే నటునిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈమధ్య ఆయనకు పెద్దగా కమర్షియల్‌హిట్స్‌లేవు. శంకర్‌తో ఆయన చేసిన 'ఐ' చిత్రం కోసం ఆయన పడిన కష్టం చూస్తే ఎవరికైనా వావ్ అనిపిస్తుంది. కానీ భారీ ఆశలు పెట్టుకున్న 'ఐ' తోపాటు సైన్స్ ఫిక్షన్‌గా తీసిన 'ఇరుముగన్' (తెలుగులో 'ఇంకొక్కడు') చిత్రాలు ఆయనకు కమర్షియల్‌హిట్స్‌ను మాత్రం అందించలేకపోయాయి. దీంతో ఆయన ఇప్పుడు తాజాగా ఒప్పుకున్న రెండు చిత్రాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన విలక్షణ దర్శకుడిగా పేరున్న గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ రొమాన్స్ చిత్రం చేస్తున్నాడు. ఇక మాస్ హీరోగా తనకు తమిళంలో మంచి పేరును తీసుకొచ్చిన చిత్రం 'సామి'. కాగా ఈ చిత్రానికి మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్‌గా పేరున్న హరి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తమిళంలో విక్రమ్‌ను అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది. కాగా ప్రస్తుతం విక్రమ్‌లాంటి పరిస్థితిలోనే ఉండి, సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న సూర్యతో హరి 'ఎస్3' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్16న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం విడుదలైన వెంటనే దర్శకుడు హరి విక్రమ్‌తో 'సామి'కి సీక్వెల్‌గా 'సామి2' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని హరి కూడా స్పష్టం చేశాడు.'ఎస్3' విడుదలైన తర్వాత హరి 'సామి2' స్క్రిప్ట్ పనుల్లో బిజీ కానున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాలైనా తనకు మంచి కమర్షియల్ బ్రేక్‌నిస్తానయే ఆశతో ఉన్నాడు చియాన్.