Advertisementt

కాజల్ అగర్వాల్ బాటలోనే కీర్తి..!

Mon 28th Nov 2016 08:23 PM
kajal agarwal,keerthy suresh,mega star,surya,karthik,ayan movie,paiyaa movie  కాజల్ అగర్వాల్ బాటలోనే కీర్తి..!
కాజల్ అగర్వాల్ బాటలోనే కీర్తి..!
Advertisement
Ads by CJ

గతంలో కూడా పలు భాషల్లో సొంత అన్నదమ్ములైన హీరోల సరసన, తండ్రీకొడుకుల సరసన కూడా కొందరు హీరోయిన్లు నటించిన సందర్భాలున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో కూడా పవన్‌ సరసన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లో నటించిన కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం ఆయన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150'లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ భామ చిరు తనయుడు రామ్‌చరణ్‌తో కూడా పలు చిత్రాలలో నటించడం విశేషం. 

కాగా విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు,తమిళ భాషల్లో స్టార్‌హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్‌కు తాజాగా కోలీవుడ్‌లో అన్నదమ్ములైన సూర్య, కార్తి నటించే చిత్రాలలో అవకాశం లభించింది. సూర్య నటిస్తోన్న 'తానా సెర్నద కూటం' అనే చిత్రంలో కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ సెట్స్‌పైకి వెళింది. కాగా ఆయన తమ్ముడు కార్తి ప్రస్తుతం మణిరత్నం చిత్రం 'డ్యూయెట్‌' చేస్తున్నాడు. దీనిలో నటిస్తూనే వినోద్‌ అనే మరో దర్శకునితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా కీర్తినే సంప్రదిస్తున్నారు. కాగా గతంలో ఈ ఇద్దరు అన్నదమ్ములతో కలసి మిల్కి బ్యూటీ తమన్నా నటించింది. సూర్యతో ఆమె 'ఆయన్‌' అనే సినిమాలో నటించింది. ఆ వెంటనే సూర్య తమ్ముడు కార్తితో 'పైయా' చిత్రంలో కలిసి నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇలా తమన్నా చూపిన బాటలోనే కీర్తిసురేష్‌ కూడా నడుస్తోంది. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ