Advertisementt

అతని సినిమాకు అతనే ప్రమోటర్..!

Mon 28th Nov 2016 02:39 PM
hero nikhil,ekkadiki pothavu chinnavada movie,promoter,nikhil  అతని సినిమాకు అతనే ప్రమోటర్..!
అతని సినిమాకు అతనే ప్రమోటర్..!
Advertisement
Ads by CJ

ఒక పెట్టుబడి భవిష్యత్తుకు రాబడి. ఈ సూత్రం ఒంటబట్టించుకున్నాడు యువ హీరో నిఖిల్. తన తాజా చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా! ' సినిమా ప్రమోషన్ సొంతంగా చేసుకుంటున్నాడట. అందు కోసం మీడియాకు తానే  సొంతంగా ప్రకటనలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. '..చిన్నవాడా' సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ' చిల్లర' కష్టాలున్నప్పటికీ మంచి కలక్షన్లు వస్తున్నాయని పరిశ్రమకు తెలియజేస్తూ, తన ఇమేజ్ ను ఆసాంతం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక హీరోకు కావాల్సింది సక్సెస్. అది ఏ విధంగా వచ్చినప్పటికీ భవిష్యత్తుకు అదే పెట్టుబడి. అందుకే సొంత ప్రమోషన్ తో పాటుగా సినిమా ప్రమోషన్ నెత్తినేసుకున్నాడని అంటున్నారు. సొంత పూచికత్తుపై పత్రికలకు ప్రకటనలిస్తూ, సినిమాను పదే పదే గుర్తుచేస్తున్నాడు. 

ఇతర యువహీరోలతో పోలిస్తే నిఖిల్ బెటర్ పొజీషన్ లో ఉన్నాడు. ప్రత్యేకమైన కథలను ఎంపికచేసుకుంటూ సాగుతున్నాడు. అందుకే ఇతర యువహీరోలు చేతులెత్తేసినా నిఖిల్ మాత్రం మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ