Advertisementt

గోల్డెన్‌లెగ్‌ బ్యూటీ అని పిలుస్తున్నారు..!

Mon 28th Nov 2016 01:41 PM
hebah patel,hero nikhil,ekkadiki pothavu chinnavada movie,kumari 21f movie  గోల్డెన్‌లెగ్‌ బ్యూటీ అని పిలుస్తున్నారు..!
గోల్డెన్‌లెగ్‌ బ్యూటీ అని పిలుస్తున్నారు..!
Advertisement
Ads by CJ

మొదట ఓ కన్నడ చిత్రంలో నటించి, ఆ తర్వాత తెలుగులో 'అలా...ఎలా' చిత్రం ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ హెబ్బాపటేల్‌. ఇక ఆమె యంగ్‌హీరో రాజ్‌తరుణ్‌ సరసన నటించిన 'కుమారి 21ఎఫ్‌, 'ఈడోరకం...వాడో రకం' చిత్రాలు రెండు హిట్టయ్యాయి. తాజాగా ఆమె మరో యంగ్‌హీరో నిఖిల్‌తో నటించిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇలా ఆమె నటిస్తే చాలు... సినిమా హిట్టేననే సెంటిమెంట్‌ మన దర్శకనిర్మాతలకు, యంగ్‌హీరోలకు ఏర్పడింది. ఇప్పుడు అందరూ ఆమెను 'గోల్డెన్‌లెగ్‌ బ్యూటీ' అని పిలుస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాలుగైదు చిత్రాలను చేస్తోంది. ఇవన్నీ యంగ్‌హీరోల సరసన నటించే పాత్రలే కావడం గమనార్హం. ఇంకా స్టార్స్‌ దృష్టి ఆమెపైపడలేదు. కానీ యంగ్‌హీరోల ఫేవరేట్‌ హీరోయిన్‌గా మాత్రం ఆమె ఫుల్‌ డిమాండ్‌తో బిజీ బిజీగా ఉంది. కాగా ఆమె ప్రస్తుతం వస్తున్న ఆఫర్ల వెల్లువ చూసి తన పారితోషికాన్ని డబుల్‌ చేసి చెబుతోందిట. నిన్నమొన్నటివరకు 25లక్షలు తీసుకున్న ఆమె ప్రస్తుతం 50లక్షలు డిమాండ్‌ చేస్తూ, హీరోలకు సరిసమానమైన పారితోషికాన్ని చెబుతుండటంతో చిన్న చిత్రాల నిర్మాతలు ఆమె వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. అయినా ఇప్పటికే 27ఏళ్లు ఉన్న ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎలాగో బాగా వంటపట్టించుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ