Advertisementt

ప్రేమ ఒకరితో..తిరిగేది మరొకరితో..!

Mon 28th Nov 2016 11:49 AM
vishal,simbu,varalakshmi,varalakshmi with simbu,public function  ప్రేమ ఒకరితో..తిరిగేది మరొకరితో..!
ప్రేమ ఒకరితో..తిరిగేది మరొకరితో..!
Advertisement
Ads by CJ

హీరో విశాల్‌, తమిళ సీనియర్‌ హీరో శరత్‌కుమార్‌ల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే సంగతి తెలిసిందే. శరత్‌కుమార్‌ కుమార్తె, తమిళ హీరోయిన్‌ వరలక్ష్మితో విశాల్‌ ప్రేమాయణం మొదలైన తర్వాతే ఈ ఇద్దరి మద్య ఇంతలా ద్వేషాలు రగిలాయని అంటుంటారు. కాగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో కేవలం శరత్‌కుమార్‌ను ఓడించేందుకే విశాల్‌ బరిలో దిగి సంచలన విజయం సాధించాడు. ఆ తర్వాత నడిగర్‌ సంఘంకు చెందిన పెళ్లి మండపం పూర్తి కాగానే అందులో తొలి వివాహం మాదే అని విశాల్‌.. వరలక్ష్మితో పెళ్లి విషయాన్ని కూడా తేల్చిచెప్పేశాడు. కాగా వీరిద్దరి మద్య ప్రేమాయణం గత ఏడేళ్లుగా నడుస్తోంది. ఎక్కువ కాలం ప్రేమించుకుంటూనే ఉంటే అది చివరికి చెడుతుందని పెద్దలు అంటారు. అందుకే వారు నిదానమే ప్రదానమని చెప్పినా, శుభకార్యాల విషయంలో ఆలస్యం అమృతం విషం అని కూడా చెప్పారు. ఇది విశాల్‌, వరలక్ష్మిల విషయంలో నిజమని మరోసారి తేలింది. తమ ఏడేళ్ల ప్రేమను ఓ వ్యక్తి తేలిగ్గా తీసుకుంటున్నాడని, అతనికి ప్రేమ విలువ తెలియదని కూడా వరలక్ష్మి ఆ మధ్య ట్వీట్‌ చేసింది. మొత్తానికి వీరి ప్రేమ బ్రేకప్‌ అయిందనేది వాస్తవం. కానీ కారణాలు మాత్రం సరిగ్గా ఎవ్వరికీ తెలియవు. కాగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో వివాదాస్పద హీరో, ప్లేబోయ్‌ శింబు శరత్‌కుమార్‌ పక్షాన విశాల్‌పై చేయరాని విమర్శలను, చాలా చెత్త కామెంట్స్‌ను, రాయలేని విధమైన పదాలను వాడుతూ విమర్శించడం తెలిసిందే. కాగా వరలక్ష్మి తాజాగా శింబు ఇచ్చిన ఓ విందుకు హాజరై శింబుతో కలిసి రొమాంటిక్‌ మూడ్‌లో డ్యాన్స్‌ చేస్తూ, ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విశాల్‌తో బ్రేకప్‌ చెప్పి, బంధం తెంచుకొని, చాలా బాడ్ టాక్ వున్న శింబుతో ఆమె అలా క్లోజ్‌గా బిహేవ్‌ చేయడం విశాల్‌ స్నేహితులను, సన్నిహితులను, అభిమానులను బాగా హర్ట్‌ చేసిందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ