Advertisementt

హీరోయిన్‌ కోరిక నెరవేర్చిన కమెడియన్‌..!

Sun 27th Nov 2016 05:17 PM
poorna,srinivasa reddy,aravind swamy,jayammu nischayammuraa movie  హీరోయిన్‌ కోరిక నెరవేర్చిన కమెడియన్‌..!
హీరోయిన్‌ కోరిక నెరవేర్చిన కమెడియన్‌..!
Advertisement
Ads by CJ

తెలుగులో 'అవును, సీమటపాకాయ్‌' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని, మంచి నటిగా ప్రశంసలందుకున్న హీరోయిన్‌ పూర్ణకు ఇప్పటివరకు కెరీర్‌ స్లోగానే సాగుతూపోతోంది. కానీ ఆమెకు హీరోయిన్‌గా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదన్నది మాత్రం వాస్తవం. కాగా ఆమె తాజాగా ఎవ్వరూ చేయని ఓ పెద్దసాహసమే చేసింది. కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా నటించిన లో బడ్జెట్‌ మూవీ 'జయమ్ము నిశ్చయంబురా' చిత్రంలో ఆయనకు హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ చిత్రం ప్రస్తుతం అచ్చమైన తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి హిట్‌టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రం హీరోయిన్‌ పూర్ణకు ఓ అద్భుతమైన అవకాశాన్ని సాధించిపెట్టింది. ఆమెకు చిన్ననాటి నుంచి అరవింద్‌స్వామి అంటే భలే ఇష్టమట. కానీ ఆయన సినిమాలు చేయడం మానేశాడని తెలిసి ఎంతో బాధపడ్డానంటోంది. కానీ తాజాగా ఆమె చిరకాల వాంఛ తీరనుంది. ప్రస్తుతం ఆమెకు ఆయన హీరోగా చేస్తున్న ఓ చిత్రంలో అరవింద్‌స్వామి భార్యగా నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆమె ఆనందంలో మునిగితేలుతోంది. తమిళ దర్శకుడు నిర్మలకుమార్‌ దర్శకత్వంలో 2014లో వచ్చి హిట్టయిన 'శత్రుజ్ఞ వెటై'కి సీక్వెల్‌ అరవింద్‌స్వామితో రూపొందుతోంది. ఈ సీక్వెల్‌ చిత్రంలో పూర్ణ.. స్వామి భార్యగా డిఫరెంట్‌ రోల్‌ను చేయనుంది. కాగా ఈ చిత్రంలో త్రిష మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి పక్కన నటించినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం లభించినట్లయింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ