Advertisementt

మోడీ ఎఫెక్ట్ : అనుష్క, నయన్ ఓన్లీ వైట్..!

Sun 27th Nov 2016 04:10 PM
modi effect,nayanthara,anushka,only white money,cine industry  మోడీ ఎఫెక్ట్ : అనుష్క, నయన్ ఓన్లీ వైట్..!
మోడీ ఎఫెక్ట్ : అనుష్క, నయన్ ఓన్లీ వైట్..!
Advertisement
Ads by CJ

మోడీ పెద్దనోట్ల రద్దు దెబ్బకి సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ తీసుకునే హీరో, హీరోయిన్స్ ఇప్పుడు కేవలం వైట్ మనీ నే తమ రెమ్యునరేషన్ కింద తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. అసలు వారు ఇప్పటి వరకు తక్కువ రెమ్యునరేషన్ ని వైట్ గా, పెద్దమొత్తంలో బ్లాక్ మనీ రూపంలోనే తమ రెమ్యునరేషన్ తీసుకునే పద్దతిని ఫాలో అయ్యేవారు. ఇక ఇపుడు బ్లాక్ లో తీసుకుంటే అది ఎందుకు పనికిరాదు కాబట్టి ఇక తమ డబ్బుని కేవలం వైట్ లోనే తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఇలా  తమ రెమ్యునరేషన్ ని వైట్ లోకి తీసుకోవడానికి ముందుగా హీరోయిన్స్ రెడీ అయ్యారని టాక్. అసలిప్పటికే మాకు అస్సలు బ్లాక్ వద్దు కేవలం వైట్  మాత్రమే కావాలని నిర్మాతలకి తెగేసి చెప్పేస్తున్నారట. ఆ హీరోయిన్స్ ఎవరో కాదు. అనుష్క, నయనతార అట. వీరిలో అనుష్క తెలుగులో బ్లాక్ మనీ  కి బదులు వైట్ కావాలని టాలీవుడ్ నిర్మాతలను అడిగినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు నయనతార తమిళం లో అనుష్క అడిగిన మాదిరిగానే వైట్ మనీ మాత్రమే కావాలని నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందట. 

అనుష్క తెలుగులో 'బాహుబలి, నమో వేంకటేశాయ, సింగం, భాగమతి' సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ సినిమాల నిర్మాతలను తన రెమ్యునరేషన్ మొత్తం వైట్ మనీ గానే కావాలని పట్టుపడుతుందోట. ఇక తమిళంలో టాప్ హీరోయిన్ గా వున్న నయన్ కూడా తనకి అస్సలు బ్లాక్ వద్దని కేవలం వైట్ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తుందని వినికిడి. మరి వీరిద్దరూ  టాప్ హీరోయిన్స్ కాబట్టి వీరు అడిగిన మొత్తాన్ని వైట్ మనీ లా ఎలా ఇవ్వాలో తెలీక నిర్మాతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారట.  ఒకరిద్దరు కండీషన్ పెడితేనే ఇలా నిర్మాతలు తలలు బాదుకుంటుంటే అందరూ ఒకేసారి అడిగితే వీరు ఏం చేస్తారో పాపం...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ