Advertisement

ఈ స్టార్‌ కి మోడీ నిర్ణయం ముందే తెలిసిందా!

Sat 26th Nov 2016 08:39 PM
narendra modi,demontisitation,dhanush,financiyar,rajinikanth,40 crores  ఈ స్టార్‌ కి మోడీ నిర్ణయం ముందే తెలిసిందా!
ఈ స్టార్‌ కి మోడీ నిర్ణయం ముందే తెలిసిందా!
Advertisement

మోదీ పెద్దనోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలలోని స్టార్‌హీరోలకు, నిర్మాతలకు పలు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఇక సినిమా రంగంలో ఎంత డబ్బున్న నిర్మాత అయినా ఫైనాన్షియర్ల నుండి వడ్డీలకు ఫైనాన్స్‌ తీసుకోవడం సహజం. కాగా మోదీ కరెన్సీ విషయంపై నిర్ణయం తీసుకున్న ముందురోజే ఓ తమిళ స్టార్‌ తాను 40కోట్ల పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకున్న ఫైనాన్షియర్‌ను తానే ఇంటికి పిలిచి మరీ ఆయన అప్పును తన బ్లాక్‌మనీతో తీర్చివేశాడని తెలుస్తోంది. దీంతో ఆ ఫైనాన్షియర్‌ తనకు ఆ స్టార్‌హీరో 40కోట్లు ఇచ్చిన పక్కరోజే మోదీ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కక్కలేక మింగలేక నానా అవస్దలుపడుతున్నాడంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. కానీ ఆ స్టార్‌ హీరో సన్నిహితులు మాత్రం ఇదంతా యాదృచ్చికంగా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని అంటుంటే, ఆ ఫైనాన్షియర్‌ మాత్రం మోదీ నిర్ణయం ఆ స్టార్‌కు ముందుగానే తెలియడంతోనే తెలివిగా తనను మోసం చేసి ఇరికించాడని, ఇప్పుడు అంత పెద్ద మొత్తాన్ని తాను వైట్‌మనీగా ఎలా మార్చుకువాలి? అంటూ తల పట్టుకుంటున్నాడట. ఈ విషయం కోలీవుడ్‌లో అందరికీ తెలిసిన విషయమేనంటున్నారు. ఆ ఫైనాన్షియర్‌కు సన్నిహితులైన కొందరు మాత్రం ఆ స్టార్‌హీరోకు ఎంతో పలుకుబడి ఉండటంతో ఆయనకు మోదీ నిర్ణయం ముందుగా తెలిసే ఇలా చేశాడంంటున్నారు. కానీ ఇటు ఇండస్ట్రీ వారు గానీ, మీడియా గానీ ఆ స్టార్‌కు చాలా పలుకుబడి ఉండటంతో పాటు పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉండటంతో ఆయన పేరును బయటపెట్టడానికి భయపడుతున్నారట. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఆ స్టార్‌ ఎవరో కాదు... సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. 

ధనుష్‌ ఈమద్యకాలంలో నిర్మాతగా కూడా మారాడు. తను నటించే చిత్రాలలో భాగస్వామిగా వ్యవహరిస్తుండటంతో పాటు బయటి హీరోలతో కూడా చిత్రాలు నిర్మిస్తున్నాడు. గత కొంతకాలంగా ధనుష్‌కు హీరోగా, నిర్మాతగా మంచి కమర్షియల్‌ హిట్‌ లేదు. ఇక ఆయన బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకోవాలనే తపనతో బాలీవుడ్‌లో తాను నటించిన చిత్రాలకు ఆయనే స్లీపింగ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఇక 'త్రీ' చిత్రం సమయంలో తన భార్య దర్శకత్వం వహించిన చిత్రం కమర్షియల్‌గా పెద్ద ఫ్లాప్‌. దాంతో ఆయనకు భారీ నష్టాలు రావడమే కాదు... ఆ చిత్రం వల్ల నష్టపోయిన బయ్యర్లకు పెద్ద మొత్తాన్ని తిరిగి ఇస్తానన్నాడు. ఇక తన మరదలు సౌందర్య దర్శకత్వంలో తన మామ రజనీకాంత్‌ నటించిన 'కొచ్చాడియాన్‌' పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా తన మామ రజనీకాంత్‌ నటించిన కొన్ని చిత్రాలు భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆయా బయ్యర్లకు కూడా రజనీ వారికి వచ్చిన నష్టాలను తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. ఇక రజనీ భార్య, తన అత్త అయిన లత కూడా కొందరికి పెద్ద మొత్తంలోనే అప్పుంది. వాటన్నింటినీ తీర్చే బాధ్యత ధనుష్‌ తీసుకున్నాడట. దీంతో పాటు ఆయన త్వరలో తన మరదలు సౌందర్య దర్శకత్వంలో తానే నిర్మాతగా, హీరోగా 'విఐపి2' చిత్రం, రజనీకాంత్‌, రంజిత్‌పా దర్శకత్వంలో మరోచిత్రం నిర్మించనున్నాడు. ముందుగానే ఈ చిత్రాల నిర్మాణం కోసం ఆయన ఫైనాన్స్‌ తీసుకున్నాడట. ఇలా వీటన్నింటి కోసం ధనుష్‌ ఆ ఫైనాన్షియర్‌ వద్ద 40కోట్లలను వడ్డీకి ఫైనాన్స్‌ తీసుకున్నాడు. ఇప్పుడు సమయం కలిసిరావడంతో తన దగ్గరున్న బ్లాక్‌మనీతో తాను చేసిన 40కోట్ల అప్పును తీర్చేశాడు. మరి ఇది యాదృచ్చికంగా జరిగిందో లేక కొందరు ఆరోపిస్తున్నట్లు మోదీ నిర్ణయం ముందుగా తెలిసిందో తెలియదు కానీ ఆ ఫైనాన్షియర్‌ను ధనుష్‌ భలే బుక్‌ చేసాడంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement