Advertisementt

పెళ్లికాని నాయికలపై అమల ప్రభావం..!

Sat 26th Nov 2016 06:01 PM
amala paul,young heroines,marriage,career,marriage life,enjoy  పెళ్లికాని నాయికలపై అమల ప్రభావం..!
పెళ్లికాని నాయికలపై అమల ప్రభావం..!
Advertisement
Ads by CJ

కెరీర్ ఉజ్వలంగా ఉన్నపుడు, దానికి బ్రేక్ వేసి పెళ్లి చేసుకోవడం సబబేనా? కెరీర్ వదులుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయలేమా? ఈ అనుమానం చాలామంది యువ నాయికల్లో కలుగుతోంది. కెరీరా, పెళ్లా? అనే రెండు ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి పలు విధాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ  హీరోయిన్ అమలాపాల్ కారణం.

'ఇద్దరమ్మాయిలతో', 'నాయక్'వంటి తెలుగు చిత్రాల్లో, పలు తమిళ సినిమాల్లో నటించిన అమలాపాల్ రెండేళ్ళ క్రితం దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది. అత్తారింటివారు నటిగా కొనసాగడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మానసికంగా ఒత్తిడికి గురయింది. చివరికి విడాకులు తీసుకుని మళ్లీ నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్లే తనకు సమస్య వచ్చిందని అమలాపాల్ అంటోంది. హ్యాపీగా సాగుతున్న కెరీర్ కు పులిస్టాప్ పెట్టి, సంసారబంధంలో ఉండిపోవాలంటే ఎవరికైనా ఇబ్బందే. పెళ్లి తర్వాత నటించడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వీటిని తెంచుకోవడం అంతసులువు కాదు. కొద్దిమంది మాత్రమే నటన వదిలేసి జీవితంలో స్థిరపడతారు. ఇప్పుడు అమలాపాల్ జీవితం చాలా మంది పెళ్లికాని నాయికలకు కొత్త ఆలోచన కలిగిస్తోంది. పెళ్లి విషయంలో తొందరపడకూడదని వారికి అమలాపాల్ సంకేతం ఇచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ