కార్తీకమాసం వచ్చిందంటే దీపారాధన గుర్తుకువస్తుంది. ఆడపడుచులు భక్తి శ్రద్దలతో జరుపునే మాసం ఇది. దీన్ని బిజినెస్ గా మార్చిన ఘనత కొన్ని టీవీ ఛానల్స్ కు దక్కుతుంది. ప్రజల భక్తిని వారు వ్యాపారంగా మార్చేశారనే విమర్శలున్నాయి. వివిధ టీవీ ఛానల్స్ లో దీపోత్సవం పేరుతో లైవ్ నిర్వహిస్తుంటారు. వేలాది మంది మహిళలు పాల్గొని దీపాలు వెలిగిస్తూ, భక్తి పారవశ్యంతో తేలుతారు. ఇక వీటికి సెలబ్రిటీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, తమ పలుకుబడిని పెంచుకుంటారు. అయితే దీని వెనుక కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. దీపోత్సవానికి ఛానల్ పెట్టే ఖర్చు కంటే రాబడి ఎక్కువుంటుందట. నిర్వహణ కోసం కొంత పెట్టుబడి పెడతారు. కార్యక్రమం మొత్తం లైవ్ కాబట్టి, రెండు రాష్ట్రాల్లో వాటి రిపోర్టర్లు, యాడ్ ఎగ్జిక్యూటివ్స్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి ప్రకటనలు తెస్తారు. లైప్ వస్తున్నపుడే ప్రకటనలు వస్తుంటాయి. వీటి వల్ల ఆదాయం కోట్లలో ఉంటుందని తెలిసింది. ఇది తెలివైన వ్యాపారం. భక్తుల భక్తి సెంటిమెంట్ ను ఈ విధంగా వాడుకుంటూ ఛానల్స్ పండుగ చేసుకుంటున్నాయి. ఎంతైనా తెలుగువాడి తెలివి ముందు ఎవరైనా బలాదూర్.