Advertisementt

ధృవ ట్రైలర్ దూసుకుపోతుంది..!

Sat 26th Nov 2016 04:25 PM
dhruva,dhruva movie trailer review,dhruva trailer sensation,ram charan  ధృవ ట్రైలర్ దూసుకుపోతుంది..!
ధృవ ట్రైలర్ దూసుకుపోతుంది..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ 'ధృవ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ముందుగా డిసెంబర్ 2న ఈ సినిమా విడుదలవుతుందని భావించినప్పటికీ.... కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది 'ధృవ' చిత్ర యూనిట్. ఈ 'ధృవ' చిత్రంలో రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 'ధృవ' ఐపీఎస్ అంటూ పోలీస్ పాత్రలో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఇక ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ ఏ క్రిమినల్ ని అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో.... అలాంటి క్రిమినల్ నా లక్ష్యం అంటూ రెచ్చిపోయే పోలీస్ కేరెక్టర్ లో కనిపించాడు. అయితే రాజకీయాలను ఒక బడా బిజినెస్ మ్యాన్ శాసిస్తుంటాడు. ఆ బడా బిజినెస్ మ్యాన్ గా అరవింద్ స్వామి ఆ కేరెక్టర్ లో కేక పుట్టించే పెరఫార్మెన్సు చేసాడు. అంతేకాదు అరవింద్ స్వామి సినిమా మొత్తంలో చాలా స్టైలిష్ విలన్ గా కనిపించనున్నాడని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధమైపోతుంది. ఇక రామ్ చరణ్ లవర్ గా రకుల్ ప్రీత్ కనిపించింది. రకుల్ ప్రీత్ కూడా చాలా మోడరన్ అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ మొత్తం రామ్ చరణ్, అరవింద్ స్వామి మధ్య కోల్డ్ వార్ ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇక ట్రైలర్ లో చివరిగా అరవింద్ స్వామి.. రామ్ చరణ్ తో చెప్పే 'లవ్ యు స్వీట్ హార్ట్' డైలాగ్ కేకపుట్టించింది. 

మరి ఈ ఒక్క ట్రైలర్ తోనే సినిమా మీద భారీ అంచనాలను పెంచేసాడు రామ్ చరణ్. ఇప్పటికే పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ తో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశారనే చెప్పాలి.  ట్రైలర్ విడుదల అయిన గంట లోపే 50 వేల వ్యూస్ తో అదరగొట్టిన ధృవ..ఇప్పుడు సోషల్ మీడియా లో దూసుకుపోతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇక 1000 రేట్ల బలంతో డిసెంబర్ 9న ప్రేక్షకులను పలకరించడానికి తయారయ్యిందనే చెప్పాలి.

Click Here to see the Dhruva Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ