Advertisementt

'2.0' లో చిరు కూడానా! నిజమేనా..?

Sat 26th Nov 2016 03:13 PM
chiranjeevi,2.0 movie,robot,shankar,rajinikanth,chiru in 2.0  '2.0' లో చిరు కూడానా! నిజమేనా..?
'2.0' లో చిరు కూడానా! నిజమేనా..?
Advertisement
Ads by CJ

రజినీకాంత్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మరో సంచలన చిత్రం 'రోబో 2 .0'. ఈ చిత్రం గురించి ఏ న్యూస్ వెలువడినా అదొక పెద్ద సంచలనంలా చెప్పేసుకుంటున్నారు సినీ ప్రియులు. అసలు ఈ సినిమా మొదలైనప్పటినుండి ఈ సినిమాపై యమా క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ఎంత గొప్పగా జరిగిందో అందరూ చూసారు. అసలు ఈ ఈవెంట్ కే భారీ మొత్తం లో ఖర్చు చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ 'రోబో 2.0' ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్రంగా మారిన  ఈ చిత్రం గురుంచి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే రజినీకాంత్ 'రోబో 2.0' లో ఒక టాలీవుడ్ టాప్ స్టార్ మెరవబోతున్నాడట. ఆ టాప్ హీరో ఎవరా? అని అప్పుడే అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. 

'రోబో 2.0 ' లో నటించే ఆ టాలీవుడ్ స్టార్ ఎవరంటే చాలా సంవత్సరాల  తర్వాత మొహానికి మేకప్ వేసుకుని ఇప్పుడు తన 150  వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'  లో నటిస్తున్న చిరు అంట. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ 'రోబో 2.0' లో చిరంజీవి నటిస్తాడని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే చిరు ఎప్పటినుండో శంకర్ డైరెక్షన్ లో నటించాలనుకుంటున్నాడట. శంకర్ ని కూడా ఈ విషయం చిరు డైరెక్ట్ గా అడిగాడట. అయితే శంకర్ అప్పుడు  బిజీగా ఉండడంతో చిరు తో సినిమా చెయ్యలేక పోయాడనే ప్రచారం జరిగింది. అందుకే ఈ 'రోబో 2.0' లో చిరు గెస్ట్ రోల్ లో చెయ్యడానికి శంకర్ ఒప్పించాడని అంటున్నారు. మరి చిరు అయితే 'రోబో 2.0' లో క్యామియో రోల్ లో నటిస్తున్నాడని అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చెయ్యాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ