టాలీవుడ్ సీనియర్‌స్టార్ అయిన నాగార్జునను ఆయన అభిమానులు జెంటిల్‌మేన్ అని, మన్మథుడని పొగుడుతుంటారు. నిజంగానే ఆయనంటే బాలీవుడ్ హీరోయిన్ల నుండి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ల వరకు అందరూ భలే ఇష్టపడుతుంటారు. ఐశ్వర్యారాయ్ నుండి నిన్నటి మొన్నటి అనుష్క, చార్మిల వరకు ఆయన అడిగితే గెస్ట్ పాత్రల్లోనే కాదు.. స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి కూడా ఓకే అంటారు. ఇక నాగ్ కు తాను నటించిన ప్రతి హీరోయిన్‌తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. 'నిన్నేపెళ్లాడతా'తో పాటు ఆయన పక్కన మరి కొన్ని చిత్రాలలో నటించిన టబూ కూడా అందులో ఒకరు. కాగా టబుతో ఆయన పలు చిత్రాలు చేస్తున్న సమయంలో ఆమె ముంబై నుండి హైదరాబాద్ వస్తే నాగ్ ఇంట్లోనే దిగేదనే వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ వార్తలను నాగ్, టబులు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఇక అనుష్క వంటి హీరోయిన్లు నాగ్ కెరీర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ టబు సంగతి మర్చిపోయారు. కాగా ఇటీవల నాగ్.. టబుతో పర్సనల్‌గా ఓ విషయం గురించి మాట్లాడాడనే ప్రచారం ఊపందుకొంది. నాగ్ నిర్మాతగా ఆయన చిన్న కుమారుడు అఖిల్ హీరోగా జనవరి నుండి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధానపాత్ర అయిన అఖిల్ తల్లి పాత్రను టబు చేత చేయించాలని భావించిన నాగ్ టబును అడగటం, ఆమె కూడా అందుకు అంగీకారం తెలిపిందనే వార్తలు ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినపడుతున్నాయి. వాస్తవానికి అఖిల్ పసివయసులో ఉన్నప్పుడు నటించిన 'సిసింద్రీ' చిత్రంలో టబు ఓ పాటలో కనిపించింది. అప్పటికి అఖిల్‌కు ఊహ కూడా తెలియదు. కానీ మరలా ఇన్నేళ్ల తర్వాత తాను హీరోగా చేస్తున్న రెండో చిత్రంలో టబు నటించనుండటం ఒక విధంగా అఖిల్‌కు వింత జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిన తీపి గుర్తే అవుతుంది. ఈ వార్తలే గనుక నిజమైతే నాగ్ అఖిల్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడమే అవుతుందని అంటున్నారు.