చిరు 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాతి బరిలో నిలపడానికి శతవిధాలా కష్టపడుతున్నారు 'ఖైదీ..' చిత్ర యూనిట్. అయితే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇక 'ఖైదీ...' ఆడియో ని భారీ లెవల్లో చెయ్యడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ నటించిన 'ధృవ' డిసెంబర్ 9న విడుదల కాగానే 'ఖైదీ...' చిత్ర ఆడియో ఫంక్షన్ చేస్తారని సమాచారం. ఇక 'ఖైదీ...' ఆడియోకి భారీ లెవల్లో గెస్టులు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటికే మెగా హీరోలందరూ హాజరవుతారని చెబుతున్న ఈ ఆడియో వేడుకకి సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు కూడా వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరందరికి ఆడియో ఇన్విటేషన్స్ అందాయని వార్తలొస్తున్నాయి. ఇక వీరితోపాటు ఇప్పటిదాకా చిరంజీవి సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అందరూ ఈ 'ఖైదీ నెంబర్ 150' ఆడియో వేడుకకి హాజరవుతారని అంటున్నారు. చిరు కెరీర్ లో మైలు రాయిగా తెరకెక్కుతున్న ఈ 'ఖైదీ నెంబర్ 150' చిత్రం అందరికి ఎప్పటికి గుర్తుండేలా కత్తిలా చెయ్యాలని ఖైదీ చిత్ర యూనిట్ ఇలా ఆడియో వేడుకని భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.