ఉద్యోగులకు చిల్లర కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టం అని గతంలో ప్రకటించి, వారి ఆగ్రహానికి గురైన కేసీఆర్ ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ జీతాలను నేరుగా బ్యాంక్ లో వేయడమే కాకుండా, అందులో కొంత మెుత్తాన్ని 'చిల్లర' నగదుగా ఇవ్వనున్నారని సమాచారం. సుమారు పదివేలు కొత్త నోట్లను ఇవ్వడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందట. ఇది ఉద్యోగులు ఆనందించే విషయమే. అలాగే ప్రజల 'చిల్లర' కష్టాలను తీర్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే అంతా హర్షిస్తారు.