Advertisementt

ఆ నిర్మాతలకు నోట్ల దెబ్బలేదా?

Fri 25th Nov 2016 02:24 PM
producers,tollywood,movie releases,big notes,big notes ban,white money  ఆ నిర్మాతలకు నోట్ల దెబ్బలేదా?
ఆ నిర్మాతలకు నోట్ల దెబ్బలేదా?
Advertisement
Ads by CJ

పెద్ద నోట్ల రద్దు సినీరంగానికి పెద్ద దెబ్బ అని ప్రచారం జరుగుతోంది. షూటింగ్ లు తగ్గాయని, థియేటర్లలో ప్రేక్షకులు లేరని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ కొందరు నిర్మాతలపై మాత్రం పెద్దనోట్ల రద్దు ప్రభావం లేదని అంటున్నారు. ఇటీవలే విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో, ఎక్కడికి పోతావు చిన్నవాడా, జయమ్ము నిశ్యయమ్మురా చిత్రాల నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. తమ సినిమాల ప్రచారాన్ని వైట్ మనీతో లెక్కకు మించి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. మీడియాకు లక్షలు వెచ్చించి ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అది కూడా హాఫ్ పేజీ ప్రకటనలు. ఇంకా టీవీల్లో కూడా అపరిమిత ప్రకటనలు ఇస్తున్నారు. దీనికోసం పెద్ద మెుత్తం  చెల్లిస్తున్నారు. నేడున్న పరిస్థితిల్లో ఆ నిర్మాతలకు వైట్ మనీ ఎక్కడ నుంచి వచ్చిందనే డౌట్ చాలామందికి ఉంది. లేదా వివిధ దినపత్రికలు, ఛానల్స్ ప్రకటనల కోసం పెద్ద నోట్లు తీసుకుంటున్నాయా? అనే అనుమానం కూడా ఉంది. ఈ గుట్టు బయటపడతుందా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ